Rajinikanth : తమిళ సూపర్ స్టార్ జీవితం గురించి అద్భుతమైన అర్థం చెప్పారు. ఎంతో ఎత్తుకు ఎదిగినా ఆయన మాత్రం తన మూలాలు మరిచి పోలేదు. అత్యంత సామాన్యమైన వ్యక్తిగా ఉండేందుకు ఇష్ట పడతాడు. ఆ మధ్యన హిమాలయాలకు వెళ్లాడు. ఆయనకు భక్తి అంటే మక్కువ. అప్పుడెప్పుడో బాబా సినిమా కూడా తీశాడు. ఆయన మంత్రాలయంలో కొలువై ఉన్న రాఘవేంద్ర స్వామి అంటే చచ్చేంత ఇష్టం. ప్రతి ఏటా దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోంది.
Rajinikanth Words
ఇదిలా ఉండగా ఆయన తమన్నా భాటియాతో కలిసి నటించిన జైలర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సందర్బంగా జరిగిన ఓ సినీ కార్యక్రమంలో తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) కీలక వ్యాఖ్యలు చేశారు. లైఫ్ అంటే ఏమిటి అనే దాని గురించి సింపుల్ గా సమాధానం ఇచ్చారు.
ఈ లోకంలో మొరగని కుక్క అంటూ ఉండదు. విమర్శించని నోరు అంటూ ఉండదు. ఇవి రెండూ జరగని ఊరు అంటూ ఉండదు. వాటి గురించి ఆలోచించడం కంటే ముందు మన పని మనం చేసుకుంటూ ముందుకు పోతూనే ఉండాలి. అదే జీవితం అంటే అని స్పష్టం చేశారు తలైవా రజనీకాంత్.
Also Read : TTD Comment : ‘భూమన’ భక్తుల కష్టాలు తీరేనా