Ajit Agarkar : ఆసియా..వరల్డ్ కప్ జట్టుపై ఉత్కంఠ
కసరత్తు చేస్తున్న బీసీసీఐ సెలెక్షన్ చైర్మన్
Ajit Agarkar : ఈ ఏడాది రెండు అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రికెట్ టోర్నీలు జరగనున్నాయి. ఒకటి ఆసియా కప్ , రెండోది ఐసీసీ నిర్వహించి వన్డే వరల్డ్ కప్. దీనికి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్(Ajit Agarkar) మల్లగుల్లాలు పడుతున్నారు. టీమిండియా హాట్ ఫెవరేట్ గా ఉన్నా జట్టు ఎంపికకు సంబంధించి ఎవరు చివరి వరకు టీమ్ లో ఉంటారనేది తెలియకుండా ఉంది. దీంతో ఫ్యాన్స్ మాత్రం ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై చర్చలు జరుపుతున్నారు.
Ajit Agarkar Plans
ప్రస్తుతం భారత జట్టులో ఫుల్ పర్ ఫార్మెన్స్ ఆధారంగా కొనసాగించే వారినే ఎంపిక చేయనుంది సెలెక్షన్ కమిటీ. ఆసియా కప్ తో పాటు వరల్డ్ కప్ లకు వేర్వేరుగా జట్లను ప్రకటిస్తారా లేదా ఉమ్మడి గానే టీమిండియాను ఎంపిక చేస్తారా అనేది ఇంకా బీసీసీఐ వెల్లడించలేదు.
ఇక ప్రాబబుల్స్ లో మాత్రం ఎవరు ఉంటారనేది మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. ఇక జట్టు విషయానికి వస్తే ..రోహిత్ శర్మ కెప్టెన్ , విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ , శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, బుమ్రా, సిరాజ్ , సూర్య కుమార్ యాదవ్ , కుల్దీప్ సింగ్ , ఇషాన్ కిషన్ , సంజూ శాంసన్ , అక్సర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ , ఉనాద్కత్ , యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్ ను ఎంపిక చేయనున్నట్లు టాక్.
Also Read : Bhumana Karunakar Reddy : సీఎం జగన్ ను కలిసిన భూమన