Hema Malini : వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. దీనిపై బుధవారం పార్లమెంట్ లో తీవ్ర రభస చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున రాద్దాంతం జరిగింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. అయితే ఫుటేజ్ లో రాహుల్ గాంధీ స్పీకర్ ను ఉద్దేశించి అన్నట్టుగా ఉంది.
Hema Malini Said
ఈ మొత్తం వ్యవహారంపై రగడ చోటు చేసుకోవడంతో దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు చిత్రంగా సమాధానం ఇచ్చారు భారతీయ జనతా పార్టీ కి చెందిన ఎంపీ, సినిమా హీరోయిన్ హేమ మాలిని(Hema Malini). తాను రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చినప్పుడు చూడ లేదన్నారు. ఆ ఘటన ఎప్పుడు ఎలా జరిగిందో తనకు తెలియదన్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం మణిపూర్ పై చర్చ తీవ్రంగా కొనసాగుతోంది. ఈ తరుణంలో చర్చను పక్కదారి పట్టించేందుకు బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ లో భాగమే ఈ ఫ్లైయింగ్ కిస్ వ్యవహారం ముందుకు తీసుకు వచ్చారంటూ విపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా కావాలని నాటకం ఆడుతోందంటూ బీజేపీ సర్కార్ పై భగ్గుమన్నారు. ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో రాహుల్ గాంధీపై విధించిన అనర్హత వేటు తొలగించారు. దీంతో ఆయన లోక్ సభలోకి ఎంట్రీ ఇచ్చారు.
Also Read : AP CM YS Jagan : అడవి బిడ్డలకు అభివందనం