Rahul Flying Kiss Comment : కిస్ కా రాహుల్ ‘ఫ్లైయింగ్ కిస్’
తన వైపే నంటున్న స్మృతీ ఇరానీ
Rahul Flying Kiss Comment : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారా. లేక తానే కావాలని వివాదాలు కొని తెచ్చుకుంటున్నాడా అన్నది చర్చనీయాంశంగా మారింది. దేశ ప్రజాస్వామ్యానికి ప్రతిబింబంగా నిలిచిన పార్లమెంట్ లోని లోక్ సభ దద్దరిల్లింది. ఆరోపణలు, దూషణలు, విమర్శలతో సాగింది. చివరి దాకా ఒకరిపై మరొకరు వ్యక్తిగతంగా మాటల తూటాలు పేల్చారు. ఇంతకూ ఏం జరిగిందనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చారు. కారణం ఆయన ఉన్నట్టుండి సభ నుంచి వెళ్లి పోతూ ఫ్లైయింగ్ కిస్ (గాల్లో ముద్దు ఇవ్వడం) ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ. అంతకు ముందు సభలో మణిపూర్ మండుతోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిద్ర పోతున్నాయని, ప్రధాన అంశంపై చర్చించాలని విపక్షాలతో కూడిన ఇండియాకు చెందిన ఎంపీలు పట్టు పట్టారు. చివరకు వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు. ఎట్టకేలకు చర్చకు అనుమతించారు స్పీకర్ ఓం బిర్లా.
Rahul Flying Kiss Comment Viral
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గౌరవ్ గొగోయ్ నిప్పులు చెరిగారు. దేశానికి సంబంధించిన ప్రధాన అంశాలు, సమస్యలు ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తప్పించు కున్నారంటూ ఆరోపించారు. భారత దేశ సరిహద్దుల్లో భద్రతా దళాలను రక్షించు కోవాలని, చైనా దాడుల నుంచి కాపాడు కోవాలని కోరినప్పుడు పీఎం లేడన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన మహోద్యమ సమయంలో రైతులు చని పోతే స్పందించ లేదని వాపోయారు. చివరకు మహిళా రెజ్లర్లు బీజేపీకి చెందిన ఎంపీ తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని రోడ్డు పైకి వచ్చినా మోదీ నవ్వారే తప్పా ఒక్క మాట మాట్లాడ లేదన్నారు. ఇక మణిపూర్ లో హింసోన్మాదం చెలరేగుతుంటే విదేశాలకు వెళ్లాడని ఆరోపించారు.
అనంతరం అనర్హత వేటు నుంచి తప్పించుకుని తిరిగి సభలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ అసాధారణమైన రీతిలో ప్రసంగించారు. కేంద్ర సర్కార్ ను, ప్రధాన మంత్రి బాధ్యతా రాహిత్యాన్ని ప్రశ్నించారు. మణిపూర్ లో భారత మాతను రెండుగా చీల్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ లో హింస చెలరేగుతుంటే, మండి పోతుంటే, కాలి పోతుంటే , అగ్నికి ఆహుతై పోతే దేశం కాలి పోయినట్టు కాదా అని నిలదీశారు. ఏ రాజ్యాంగం చెప్పింది , ఎవరు ఇచ్చారు మీకు ఈ హక్కులు, మౌనంగా ఉండమని , స్పందించ కూడదని ఏమైనా రాసి ఉంచారా అని నిప్పులు చెరిగారు. ఈ దేశం ఎప్పటికీ మోదీని క్షమించ బోదని , రాబోయే కాలంలో ఆయనను ఒక విఫలమైన పీఎంగా చూస్తుందని హెచ్చరించారు. ఈ సమయంలో సభ నుంచి వెళ్లి పోయే ముందు స్పీకర్ ను ఉద్దేశించి వేలు చూపించారు. ఇది మాత్రమే రికార్డ్ అయ్యింది. ఈ సమయంలో ఆయన లోక్ సభ నుంచి మాట్లాడుకుంటూ నిష్క్రమించారు.
రాహుల్ వెళుతూనే మహిళా ఎంపీలను చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు లోక్ సభ సాక్షిగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. ఇలాంటి చౌకబారు, క్యారెక్టర్ కలిగిన రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఉండడం మంచిది కాదన్నారు. మహిళా ఎంపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై మొత్తం ఫుటేజ్ ను పరిశిలీంచాలని ఓం బిర్లా ఆదేశించారు. ఏది ఏమైనా పార్లమెంట్ ప్రజా సమస్యల ప్రస్తావనకు వేదిక కావాలే తప్పా వ్యక్తిగత అభిజ్యాత్యాలకు కేరాఫ్ గా మారకూడదు. దీనిని గమనించి నడుచుకుంటే బెటర్. ఇంతకూ ఫ్లైయింగ్ కిస్ అనేది ఇచ్చాడా లేదా అన్నది తేలాల్సి ఉంది. అది కెమెరాలు మాత్రమే తేల్చగలవు. ఇంకెవ్వరి వల్ల సాధ్యం కాదన్నది మాత్రం వాస్తవం.
Also Read : Chandra Babu Naidu : జగన్ వల్లనే పడకేసిన ప్రాజెక్టులు