Bhola Shankar Ticket Rates : భోళా శంకర్ మూవీకి సర్కార్ షాక్
టికెట్ల ధరలు పెంపునకు నిరాకరణ
Bhola Shankar Ticket Rates : మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన భోళా శంకర్ మూవీ నిర్మాతలకు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్ర సర్కార్ పై మెగాస్టార్ చిరంజీవి అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. తమ రెమ్యూనరేషన్ గురించి ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయంటూ ప్రశ్నించారు చిరంజీవి. మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య 200వ రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. దీనిపై మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని నిప్పులు చెరిగారు. టాలీవుడ్ పకోడి గాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు స్పందించారు.
Bhola Shankar Ticket Rates Issue With Govt
ఇదే సమయంలో చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్ కలిసి నటించిన భోళా శంకర్(Bhola Shankar) ఆగస్టు 11న రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ నిర్ణయించారు. ప్రతిసారి టాలీవుడ్ కు చెందిన బడా హీరోలకు సంబంధించి ముందుగానే టికెట్ రేట్ల ధరలను పెంచుకునేందుకు ఇరు తెలుగు రాష్ట్రాలు ముందస్తు అనుమతి ఇచ్చేవి.
తాజాగా ఏపీ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. తమకు సమర్పించిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, పలు డాక్యుమెంట్లు జత చేయలేదని ప్రభుత్వ వర్గాలు తిరస్కరించాయి. తాజాగా చిరంజీవి ఏపీ సర్కార్ ను దూషించడం వల్లనే ఇలా చేస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్ మండి పడుతున్నారు.
Also Read : Rahul Flying Kiss Comment : కిస్ కా రాహుల్ ‘ఫ్లైయింగ్ కిస్’