Rahul Gandhi : ప్రముఖ రచయిత్రి మీనా కంద సామి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో తనకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడంటూ సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. బీజేపీ మహిళా ఎంపీలు రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీసీ ఫుటేజ్ పరిశీలించాలని ఆదేశించారు.
Rahul Gandhi Flying Kiss Issue
దీనిపై రాహుల్ గాంధీ వ్యవహారం, ఆయన ప్రవర్తనపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు, అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాహుల్ గాంధీకి సంబంధించి ప్రముఖ రచయిత్రి, పెన్ అవార్డు గ్రహీత మీనా కందసామి(Meena Kandaswami) ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాహుల్ వ్యక్తిగత సమావేశాలలో, భారత్ జోడో యాత్ర సందర్భంగా తాను గమనించానని ఆయన చాలా స్పోర్టివ్ గా ఉంటారని ప్రశంసించారు.
రాహుల్ సమక్షంలో మహిళలు సురక్షితంగా ఉంటారని పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకుల్లాగా వెకిలి చేష్టలు, దొంగ చూపులు ఆయనలో కనిపించవని స్పష్టం చేశారు మీనా కంద సామి. ఆయన జోడో యాత్ర సందర్భంగా వృద్దులు, పిల్లలతో కరచాలనం చేశాడు. ఆ సన్నివేశాలను ఎలా మరిచి పోగలమని గుర్తు చేశారు. మొత్తంగా ఆమె రాహుల్ క్యారెక్టర్ కు ఫిదా అయ్యానని పేర్కొనడం విశేషం. మను స్మృతిని నమ్మే వాళ్లకు ఆయన అర్థం కాడంటూ ఎద్దేవా చేశారు మీనా కుంద సామి.
Also Read : Sajjala Ramakrishna Reddy : చిరంజీవిపై సజ్జల కామెంట్స్