Sajjala Ramakrishna Reddy : చిరంజీవిపై సజ్జల కామెంట్స్
పారదర్శకంగా పాలసీలు పెట్టారు
Sajjala Ramakrishna Reddy : మెగాస్టార్ చిరంజీవిపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. ప్రత్యేక హోదా గురించి తను మాకు చెప్పే బదులు ఆయనే నేరుగా ప్రధానితో మాట్లాడవచ్చని సూచించారు. సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా అన్నది అంగట్లో సరుకు కాదన్నారు. ఎవరి ప్రయత్నం వారు చేయాలని సూచించారు. ఏదో అన్నాం కదా అని బురద చల్లే ప్రయత్నం చేస్తే ఎలా అని సజ్జల ప్రశ్నించారు.
Sajjala Ramakrishna Reddy Comments
ప్రత్యేక హోదా రాష్ట్రానికి రావాలని పలుమార్లు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నానా రకాలుగా ప్రయత్నాలు చేశారు. వచ్చిన ప్రతి సందర్భం లోనూ వివరించే ప్రయత్నం చేశారని చెప్పారు. అయినా కేంద్రం నుంచి ఇప్పటి దాకా స్పందించిన దాఖలాలు లేవన్నారు.
ప్రత్యేకించి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించిన చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తో చెప్పి మోదీతో ఓకే చేయించు కదా అని నిలదీశారు. పవన్ ఇప్పుడు ఎన్డీఏకు మద్దతు తెలుపుతున్న సమయంలో చేయిస్తే జనం గుర్తు పెట్టుకుంటారంటూ ఎద్దేవా చేశారు.
ఇక సంక్షేమం అయినా , ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా పారదర్శకంగా పాలసీలు పెట్టిన ఘనత ఏపీ సీఎం జగన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. బడ్జెట్ దాటితే సపోర్టివ్ డాక్యుమెంట్లు సమర్పించి టికెట్లు పెంచు కోవచ్చని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణా రెడ్డి. గతంలో ఇదే పాలసీలు బాగున్నాయంటూ మీరు మెచ్చు కోలేదా అంటూ చిరంజీవిని ప్రశ్నించారు.
Also Read : Amit Shah : ఒక్క ఓటుతో ఓడినా కొనుక్కోలేదు
