Pawan Kalyan : శభాష్ పవన్ కళ్యాణ్ – ఎంవీఆర్ శాస్త్రి
ఎవరి కళ్లలో ఆనందం కోసం తెంచారు
Pawan Kalyan : మాజీ సంపాదకుడు ఎంవీఆర్ శాస్త్రి నిప్పులు చెరిగారు. ఆయన జనసేన పవన్ కళ్యాణ్ ను అభినందనలతో ముంచెత్తారు. ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కడు నిలదీసిన నాయకుడని పేర్కొన్నారు. అర్చకుడి యజ్ఞోపవీతాన్ని తెంచడం ఎవరి కళ్లలో ఆనందం కోసం చేశారంటూ ప్రశ్నించారు. ఇంతకు ముందు సిగ్గు లేకుండా అన్నవరంలో అర్చకులను వేలం పాట వేయాలని అనుకోవడం దారుణమన్నారు.
Pawan Kalyan Good Vibes
దీనిని కూడా ఖండించిన పవన్ కళ్యాణ్ మిగతా నేతల కంటే ముందంజలో ఉన్నారని కొనియాడారు ఎంవీఆర్ శాస్త్రి(MVR Sastry). సూడో సెక్యులర్ హిపోక్రసీ లేకుండా నియమబద్దంగా వ్యవహరిస్తూ ,తప్పును తప్పు అని ధైర్యంగా నిలదీయ గలిగిన ఇలాంటి నాయకులే దేశానికి కావాలని పేర్కొన్నారు . శభాష్ పవన్ కళ్యాణ్ అంటూ కితాబు ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.
సోమేశ్వర ఆలయంలో పనిచేస్తున్న ఓ అర్చకుడి యజ్ఞోప వీతాన్ని ఆ ఆలయ చైర్మన్ భర్త తెంచడం కలకలం రేపింది. దీనిపై ఇప్పటి వరకు రాష్ట్ర సర్కార్ స్పందించ లేదు. దేవాదాయ శాఖ నోరు విప్పలేదు. పవన్ కళ్యాణ్ ఒక్కడే గొంతెత్తి ప్రశ్నించాడు. ప్రభుత్వాన్ని నిలదీశాడు. దీనిపై ఎంవీఆర్ శాస్త్రి కామెంట్ చేశారు.
Also Read : Vasanth Ravi Rajinikanth : సార్ మీతో ప్రయాణం అద్భుతం