Asia Cup Commentary Panel : ఆసియా కప్ కామెంటరీ ప్యానెల్
వెల్లడించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ వెల్లడించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్
Asia Cup Commentary Panel : బీసీసీఐ ఆధ్వర్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సారథ్యంలో వచ్చే నెల సెప్టెంబర్ లో ఆసియా క్రికెట్ కప్ సంబురం మొదలు కానుంది. ఇప్పటికే టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించాయి ఆయా దేశాల క్రికెట్ బోర్డులు. ఇందులో మొత్తం ఆరు టీమ్ లు పాల్గొంటున్నాయి. భారత్ , పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ , బంగ్లాదేశ్, నేపాల్ ఆడనున్నాయి. భారత జట్టుకు సంబంధించి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. యూత్ కు ప్రయారిటీ ఇచ్చింది.
Asia Cup Commentary Panel Finalised
తాజాగా ఆసియా కప్ కు సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ కామెంటేటర్స్ ప్యానల్(Asia Cup Commentary Panel) ను డిక్లేర్ చేసింది. ఇందులో భారత దేశానికి చెందిన మాజీ క్రికెటర్ , మాజీ హెడ్ కోచ్ ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రికి చోటు దక్కింది. ఆయనతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ రమీజ్ రజా, సంజయ్ మంజ్రేకర్ , గౌతం గంభీర్ , ఇర్ఫాన్ పఠాన్ ఉన్నారు.
వీరితో పాటు కామెంటేటర్లుగా దీప్ దాస్ గుప్తా, వసీం అక్రమ్ , వకార్ యూనిస్, బాజిద్ ఖాన్, అథర్ అలీ ఖాన్ , రస్సెల్ అర్నాల్డ్ , స్కాట్ స్టైర్స్ ను ఎంపిక చేసినట్లు ఏసీసీ స్పష్టం చేసింది. మొత్తంగా ఈ టోర్నీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా బీసీసీఐ ఆధ్వర్యంలో వన్డే వరల్డ్ కప్ కూడా నిర్వహించనుంది. మొత్తంగా ఈ ఏడాది టోర్నీల పండుగ పలకరించ బోతోంది.
Also Read : Uma Geddam Pawan : రుజువు చేస్తే రాజీనామా చేస్తా – ఉమ