Leopard TTD : తిరుమలలో మరో చిరుత కలకలం
నడక దారిన పరుగులు తీసిన భక్తజనం
Leopard TTD : తిరుమల నడక దారిలో సోమవారం చిరుత కలకలం సృష్టించింది. నడక దారిన స్వామి వారి దర్శనం కోసం బయలు దేరిన భక్తులకు ఉన్నట్టుండి చిరుత తమ వైపు రావడం కనిపించింది. దీంతో భక్తులు కేకలు, అరుపులతో హోరెత్తించారు. దీంతో చిరుత భయాందోళనకు గురై అడవిలోకి వెళ్లి పోయింది.
Leopard TTD Viral
ఇప్పటికే కాలి నడకన తిరుమలకు వెళుతుండగా చిన్నారి లక్షితను చంపేసింది. ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది. భక్తులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ, పోలీసు శాఖ సంయమనంతో అడవిని జల్లెడ పట్టారు. చివరకు బోను ఏర్పాటు చేయడంతో చిరుత చిక్కింది. దానిని బోనులో బంధించి తీసుకు వెళ్లారు.
ఇదిలా ఉండగా ఇవాళ టీటీడీ ఈవో సంఘటన స్థలాన్ని సందర్శించారు. ప్రస్తుతానికి ఒకటి చిరుత మాత్రమే పట్టుబడిందని, కానీ ఇంకా అటవీ ప్రాంతంలో మూడు చిరుతలు ఉన్నాయని వాటిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు ఏవీ ధర్మారెడ్డి(AV Dharma Reddy).
తాజాగా నడక దారిలో ఉదయం తిరుమలలో చిరుత కలకలం రేపడంతో భయాందోళనకు గురయ్యారు. పరుగులు తీశారు. టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఒక చిరుత చిక్కిందని ఊపిరి పీల్చుకున్న టీటీడీకి ఇప్పుడు మరో చిరుత కలకలం రేపడంతో కంటి మీద కునుకు లేకుండా పోయింది. మొత్తంగా ఎన్ని చిరుతలు ఉన్నాయనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read : Congress Joinings : కాంగ్రెస్ లో చేరిన మైనార్టీ నేతలు