Jailer 300 Crores : రూ. 300 కోట్ల క్ల‌బ్ లో చేరిన జైల‌ర్

బాక్సాఫీసులు బ‌ద్ద‌లు కొడుతున్న ర‌జ‌నీ

Jailer 300 Crores : నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ , ముద్దుగుమ్మ త‌మ‌న్నా భాటియా క‌లిసి న‌టించిన జైల‌ర్ దుమ్ము రేపుతోంది. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించిన ఈ సినిమా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది. ర‌జ‌నీ, త‌మ‌న్నాతో పాటు క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్ కుమార్ , మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ తో పాటు ప్ర‌ముఖ క‌మెడియ‌న్ యోగి బాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Jailer 300 Crores Collections

ఆగ‌స్టు 10న జైల‌ర్(Jailer) విడుద‌లైంది ప్ర‌పంచ వ్యాప్తంగా. తొలి షోపై మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చినా ఆ త‌ర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ర‌జ‌నీకాంత్ సూప‌ర్ స్టార్ న‌ట‌న‌, మేన‌రిజం, డైలాగులు, పాట‌లు, ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ మ‌రోసారి దుమ్ము రేపేలా చేసింది జైల‌ర్ చిత్రం.

ఇదిలా ఉండ‌గా తొలి రోజు ర‌. 95.78 కోట్లు వ‌సూలు కాగా 2వ రోజు రూ. 56.24 కోట్లు, 3వ రోజు రూ. 68.51 కోట్లు, 4వ రోజు రూ. 82.36 కోట్లు వ‌సూలు చేసింది జైల‌ర్. మొత్తంగా నాలుగు రోజుల‌కు గాను ఏకంగా రూ. 302.89 కోట్లు వ‌సూలు చేసింది. ఇదిలా ఉండ‌గా ర‌జ‌నీకాంత్ త‌న సినీ కెరీర్ లో జైల‌ర్ 300 కోట్ల క్ల‌బ్ లో చేరిన నాలుగో చిత్రంగా నిలిచింది. ఎంధిర‌న్ , క‌బాలి కూడా రికార్డు స్థాయిలో నిలిచింది.

Also Read : Leopard TTD : తిరుమ‌ల‌లో మ‌రో చిరుత క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!