Rahul Gandhi : ద్వేషంతో దేశాన్ని జయించ లేరు
వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ
Rahul Gandhi : వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్వేషంతో దేశాన్ని జయించ లేరని స్పష్టం చేశారు. భారత దేశం అంటే ఒక ఆలోచన, దేశం అంటే ఒక నినాదం. ఎవరైతే ఈ ఆలోచనను , నినాదాన్ని హత్య చేస్తారో వారు ఈ దేశాన్ని నిజంగా ప్రేమించ లేరంటూ స్పష్టం చేశారు.
Rahul Gandhi Comments on Modi
దేశానికి ఆగస్టు 15తో 76 ఏళ్లు పూర్తవుతుందని అయినా ఈ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో మనుషుల మధ్య విభేదాలు కొనసాగుతుండడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కేంద్రంలో కొలువు తీరిన మోదీకే దక్కుతుందని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ.
137 కోట్ల మంది ప్రజలకు కావాల్సింది ద్వేషం కాదని కాసింత ప్రేమ , భరోసా, ఉపాధి కావాలన్నారు. ఇవాళ దేశం ద్వేషంతో రగిలి పోతోందని దీనికి ప్రధాన కారకుడు మోదీ అని ఆరోపించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). గత మూడు నెలలకు పైగా మణిపూర్ కాలి పోతోందని ఇప్పటి వరకు ప్రధాన మంత్రి నోరు విప్పలేదన్నారు. దీనిపై తాము పదే పదే ప్రస్తావించినా, ప్రశ్నించినా పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ.
ఇకనైనా మోదీ మారక పోతే దేశం బాగుపడదని, ఇది దేశ ప్రజలందరికీ తీవ్ర నష్టం చేకూరుతుందని హెచ్చరించారు.
Also Read : Jailer 300 Crores : రూ. 300 కోట్ల క్లబ్ లో చేరిన జైలర్