Chevireddy Mohit Reddy : తుడా చైర్మన్ గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
నియమించిన ఏపీ సీఎం జగన్ రెడ్డి
Chevireddy Mohit Reddy : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవి రెడ్డి మోహిత్ రెడ్డికి కీలకమైన పదవి అప్పగించారు. తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ (తుడా) చైర్మన్ గా చెవి రెడ్డి మోహిత్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విప్ గా ఇప్పటికే తన తండ్రి చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారను. ఇక నుంచి రాబోయే ఎన్నికల సందర్బంగా పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించనున్నారు.
Chevireddy Mohit Reddy Got New Position
ఇదిలా ఉండగా తుడా చైర్మన్ గా నియమితులైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి(Chevireddy Mohith Reddy) తిరుపతి రూరల్ ఎంపీపీగా ఉన్నారు. ఆయన రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో ఉండనున్నారు. ఇటీవల రాష్ట్ర సర్కార్ చేపట్టిన గడప గడప కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు మోహిత్ రెడ్డి. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపాయి ప్రతిపక్షాలు. ఏ అధికారిక హోదాతో పాల్గొంటున్నారంటూ ప్రశ్నించారు.
ఇదే విషయాన్ని తన తండ్రి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపీ సీఎం జగన్ రెడ్డికి తెలిపారు. చివరకు ఆలోచించిన సీఎం తుడా చైర్మన్ గా నియమించారు. దీని వల్ల పూర్తిగా అధికారిక హోదా దక్కుతుంది. ఎక్కడికైనా ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనవచ్చు.
Also Read : Nara Lokesh : దళితులపై జగన్ కపట ప్రేమ