Jailer 350 Crores : త‌లైవా ర‌జ‌నీ జైల‌ర్ రికార్డ్ బ్రేక్

రూ. 350 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు

Jailer 350 Crores : నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌మ‌న్నా భాటియా క‌లిసి న‌టించిన జైల‌ర్ రికార్డుల మోత మోగిస్తోంది. ఆగ‌స్టు 10న జైల‌ర్ చిత్రం విడుద‌లైంది. తొలి షో త‌ర్వాత మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చినా ఆ త‌ర్వాత సూప‌ర్ టాక్ తెచ్చుకుంది. ప్ర‌స్తుతం రూ. 350 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది జైల‌ర్ మూవీ.

Jailer 350 Crores Collections

తొలి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా జైల‌ర్ వ‌సూళ్లు దుమ్ము రేపాయి. 10న రూ. 95.78 కోట్లు వ‌సూలు చేసింది. రెండవ రోజు రూ. 56.24 కోట్లు, 3న రోజు రూ. 68.51 కోట్లు, 4వ రోజు రూ. 82.36 కోట్లు, 5న రూ. 49.03 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఐదు రోజులలో మొత్తం జైల‌ర్ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 351 కోట్లు వ‌సూలు చేసి రికార్డు బ్రేక్ చేసింది.

ఇవాళ ర‌జ‌నీకాంత్ చిత్రం జైల‌ర్(Jailer) రూ. 400 కోట్ల క్ల‌బ్ లోకి ప్ర‌వేశించేందుకు సిద్దంగా ఉంది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ , ముద్దుగుమ్మ త‌మ‌న్నా భాటియాతో పాటు క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరోగా ఉన్న శివ రాజ్ కుమార్ , మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న మోహ‌న్ లాల్ క‌లిసి న‌టించారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాబోయే రోజుల్లో జైల‌ర్ చిత్రం రికార్డుల మోత మోగించ‌డం ఖాయ‌మ‌ని తేలి పోయింది.

Also Read : Chevireddy Mohit Reddy : తుడా చైర్మ‌న్ గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!