RK Roja Selvamani : దేశానికే ఆదర్శం ఏపీ రాష్ట్రం – ఆర్కే రోజా
వీరుల త్యాగ ఫలం దేశానికి స్వతంత్రం
RK Roja Selvamani : ఎందరో వీరుల త్యాగ ఫలితమే నేడు మనందరం స్వేచ్ఛాయుతంగా బతుకుతున్నామని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా(RK Roja Selvamani) సెల్వమణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మువ్వొన్నెల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు మంత్రి ఆర్కే రోజా సెల్వమణి.
RK Roja Selvamani Words
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని వినిపించారు. దేశ విముక్తి కోసం సాగిన పోరాటంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎందరో పాల్గొన్నారని అన్నారు. ఈ సందర్భంగా సాగిన ప్రతి ఉద్యమంలో, ఆందోళనలో మన వారి పాత్ర విస్మరించ లేనిదని స్పష్టం చేశారు ఆర్కే రోజా సెల్వమణి.
దేశం గర్వ పడేలా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో కొనసాగుతోందన్నారు. ప్రత్యేకించి విద్యా, ఆరోగ్య రంగాలకు ప్రయారిటీ ఇస్తోందని చెప్పారు. అంతే కాకుండా ఇవాళ వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసిన ఘనత ఏపీ సీఎంకు దక్కుతుందన్నారు. విద్యా పరంగా తీసుకు వచ్చిన నాడు నేడు కార్యక్రమం దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలిచిందని ఈ క్రెడిట్ సీఎంకు దక్కిందన్నారు మంత్రి ఆర్కే రోజా సెల్వమణి.
Also Read : CJI DY Chandrachud : రాజ్యాంగం దేశానికి రక్షణ కవచం