Vyooham Movie Teaser-2 : వ్యూహం మూవీ టీజ‌ర్-2 రిలీజ్

ఆర్జీవీ చిత్రంపై ఉత్కంఠ

Vyooham Movie Teaser-2 : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తీసిన వ్యూహం(Vyooham Movie Teaser-2) చిత్రానికి సంబంధించి ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా టీజ‌ర్ -2 రిలీజ్ చేశారు. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. గ‌త కొంత కాలం నుంచీ అటు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును ఇటు ప‌వ‌ర్ స్టార్ , జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఎక్క‌డా వ‌ద‌ల‌డం లేదు. నిత్యం వ‌రుస కామెంట్స్ తో హోరెత్తిస్తూ వ‌స్తున్నారు ద‌ర్శ‌కుడు ఆర్జీవీ. ఆయ‌న పంచ్ లు, ప్రాస‌ల‌తో ట్విట్ట‌ర్ వేదిక‌గా నింపేస్తున్నారు. సెటైర్ల‌తో విరుచుకు ప‌డుతున్నారు. సినిమా మీద మంచి ప‌ట్టున్న ఆర్జీవీ ఉన్న‌ట్టుండి వివాదాద‌స్ప అంశాల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతూ వ‌చ్చారు.

Vyooham Movie Teaser-2 Released

రాయ‌ల‌సీమ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ఓ చ‌రిత్ర క‌లిగిన దివంగ‌త ప‌రిటాల ర‌వీంద్ర మీద సినిమా తీశాడు. ఆ త‌ర్వాత ఆంధ్రాలో స్పెషల్ ఇమేజ్ క‌లిగిన వంగ‌వీటి మోహ‌న రంగా పై చిత్రం తీశాడు. తాజాగా ఏపీలో కొలువు తీరిన వైసీపీ చీఫ్, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స‌పోర్ట్ గా వ్యూహం తీశాడు. తాజా చిత్రంలో ఏపీలో చోటు చేసుకున్న పాలిటిక్స్ , వైఎస్ జ‌గ‌న్ బ్యాక్ డ్రాప్ తీశాడు. ఈ మూవీలో ప్ర‌త్యేకించి ఆనాడు దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి దుర్మ‌ర‌ణం ద‌గ్గ‌రి నుంచి నేడు జ‌గ‌న్ ఏపీకి సీఎం అయ్యేంత వ‌ర‌కు చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను ఈ చిత్రంలో తెలియ చెప్పేందుకు ప్ర‌య‌త్నం చేశాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.

ఇందులో చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ , సోనియా గాంధీ పోలిన పాత్ర‌ల‌ను ప్ర‌తి నాయ‌కులుగా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. ఇందులో భారీ డైలాగులు కూడా ఉన్నాయి. నిజం త‌న షూ లేస్ క‌ట్టుకునే లోపే అబ‌ద్దం ప్ర‌పంచ‌మంతా ఓ రౌండ్ వేసి వ‌స్తుంది. ప‌వ‌న్ ను ఉద్దేశించి చంద్ర‌బాబు పాత్ర ద్వారా చెప్పిన డైలాగ్ మ‌రింత వివాదం రేపేలా ఉంది. వాడికి అంత సీన్ లేదు..త‌న‌ను తానే పొడుచుకుంటాడ‌ని.

Also Read : RK Roja Selvamani : దేశానికే ఆద‌ర్శం ఏపీ రాష్ట్రం – ఆర్కే రోజా

Leave A Reply

Your Email Id will not be published!