27న అలియాస్ రుక్మిణి మూవీ సాంగ్ రిలీజ్

అధికారికంగా ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్

హైద‌రాబాద్ : న‌టుడు నితిన్ నటించిన తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ . ఈ చిత్రం నుండి మొదటి పాట ‘రుకు రుకు రుక్మిణి’ విడుదల కానుంది. ఈ విష‌యాన్ని మూవీ మేక‌ర్స్ అధికారికంగా వెల్ల‌డించింది. డిసెంబర్‌లో ‘అలియాస్ రుక్మిణి’ అనే పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు నితిన్ . సినిమా విడుదల తేదీ దగ్గరప డుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంది. ప్రముఖ నటుడు నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ప్రోమో సోషల్ మీడియాలో మంచి స్పందనను పొందాయి. ఇప్పుడు ఈ సినిమాలోని మొదటి పాట రుకు రుకు రుక్మిణి…ని అక్టోబర్ 27న విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమైంది; ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. కృష్ణ, రుక్కుతో ప్రేమలో పడే అందమైన పాట తొలి సింగిల్ రానుంద‌ని తెలిపారు.

అంతే కాదు మూవీ మేక‌ర్స్ కీల‌క అప్ డేట్ కూడా ఇచ్చేశారు. అలియాస్ రుక్మిణి మూవీ విడుద‌ల తేదీ కూడా ఖ‌రారు చేశారు. వ‌చ్చే డిసెంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో, నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మురళి రచన, దర్శకత్వం వహించారు. విడుదలైన పోస్టర్ చాలా ఆకర్షణీయంగా ఉండి, ‘కృష్ణ’ పాత్రలో ఉన్న నితిన్‌కు తన ‘రుక్మిణి’పై ఉన్న ప్రేమను ప్రతిబింబిస్తోంది. ఈ చిత్రంలో రుక్మిణి ఒక కఠినమైన ఉపాధ్యాయురాలు. ఆమెను పాఠశాలలోని విద్యార్థులు ముద్దుగా ‘డెవిల్’ అని పిలుస్తుంటారు. అంతకు ముందు చిత్ర బృందం నితిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, ఆయనను ‘కృష్ణ’ అనే రచయితగా పరిచయం చేసింది. ఈ కృష్ణ పాత్ర ‘గరం గోపాల్’, ‘వ్రతం వెంకన్న’ వంటి తన రొమాంటిక్ పుస్తకాలతో బాగా ప్రాచుర్యం పొందింది.

Leave A Reply

Your Email Id will not be published!