‘ఆదర్శ కుటుంబం’ కోసం మల్లారెడ్డి కాలేజీలకు సెలవు
సంచలన ప్రకటన చేసిన కలాశాలల చైర్మన్ ప్రీతి రెడ్డి
హైదరాబాద్ : మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ఆదర్శ కుటుంబం. ఈ సినిమా అక్టోబర్ 30న విడుదల కానుంది. ఇటీవలే సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా చైర్మన్ ప్రీతి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఏకంగా ఆదర్శ కుటుంబం మూవీని చూసేందుకు గాను విద్యార్థులు, సిబ్బందికి సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు స్టేజిపైనే. దీనిపై , ఆమె చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో మండిపడుతున్నారు తనను. ఒక సినిమా విడుదల కోసం కళాశాలలో సెలవు ప్రకటించాలనే నిర్ణయం సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. ‘విక్టరీ’ వెంకటేష్ నటించిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం అక్టోబర్ 30న విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కళాశాల ఆ రోజున మూసి ఉంటుందనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి.
ఈ వ్యవహార విద్యాసంస్థలు చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలా లేక సినిమా ప్రమోషన్లు, వినోద కార్యక్రమాలకు ప్రాముఖ్యత ఇవ్వాలా అనే చర్చకు దారితీసింది. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కళాశాలలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత, సినిమా విడుదల రోజున కళాశాలకు సెలవు ప్రకటించారనే వార్త ఆన్‌లైన్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది.మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ చైర్‌పర్సన్, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో చాలామంది ఈ సెలవు ప్రకటనను విమర్శించారు. ఒక సినిమా విడుదల కోసం విద్యార్థులకు సెలవు ఎందుకు ఇవ్వాలని వారు ప్రశ్నించారు.
విద్యాసంస్థలు తరచుగా ఇలాంటి ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించడం కంటే, బోధన , విద్యార్థుల వికాసంపై దృష్టి పెట్టాలని కొందరు వాదించారు. మరికొందరు, ఇటువంటి నిర్ణయాలు ఇతర కళాశాలల్లో కూడా ఇలాంటి పద్ధతులకు దారి తీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఏదైనా విద్యాసంస్థలో చేర్పించే ముందు, ఆ సంస్థ దేనికి ప్రాధాన్యతనిస్తుందో జాగ్రత్తగా పరిశీలించు కోవాలని సూచించారు. ఒక కళాశాల ప్రధాన దృష్టి ఎప్పుడూ విద్య , విద్యార్థుల భవిష్యత్తుపైనే ఉండాలని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. కళాశాలలు విద్యాభ్యాసం కోసమా లేక సినిమా ప్రమోషన్ల కోసమా అని మరో యూజర్ ప్రశ్నించారు. అలాగే, కళాశాల యాజమాన్యంపై ప్రభుత్వం చర్య తీసుకుంటుందా అని కూడా అడిగారు.
