YS Sharmila : లక్షన్నర ఎకరాలకు లక్షా 25 కోట్లా
కమీషన్ల కోసమే కాళేశ్వరం
YS Sharmila : కేవలం కమీషన్లు దండు కోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. తొలుత 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారని, ఆ తర్వాత మోసం చేశారంటూ ఆరోపించారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,50,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు అందుతాయంటూ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీ సాక్షిగా చెప్పారని ఇంతకంటే బహిరంగ దగా ఇంకెక్కడా ఉండదని ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల.
YS Sharmila Slams KCR
కాళేశ్వరం వల్ల అదనపు భారం తప్పా ఒరిగింది ఏమీ లేదన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు మాత్రమే పెరిగాయని రైతులకు ఎలాంటి సాయం జరగలేదని ఆవేదన చెందారు వైఎస్ షర్మిల(YS Sharmila). దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవలం గ్రావిటీ ద్వారా రూ. 38 వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్లను పూర్తి చేయాలని భావించారని కానీ పెద్ద దొర కేసీఆర్ కమీషన్లతో దోచు కునేందుకు రీ డిజైనింగ్ పేరుతో రూ. 1.25 లక్షల కోట్లకు పెంచాడని సంచలన ఆరోపణలు చేశారు .
ఇప్పటికే సగం డబ్బులను కాజేశాడని, వేల కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు వస్తున్నాయని పేర్కొన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్. దోచు కోవడం దాచు కోవడం తప్ప బీఆర్ఎస్ కు ఏ పనీ లేదన్నారు వైఎస్ షర్మిల. నీళ్లు రాలేదని భూగర్భ జలాలు మాత్రమే వచ్చాయంటూ కేటీఆర్ చెప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
Also Read : Jailer 450 Crores : జైలర్ కలెక్షన్ల వేట రికార్డుల మోత