Jailer 450 Crores : జైల‌ర్ క‌లెక్ష‌న్ల వేట రికార్డుల మోత‌

దుమ్ము రేపుతున్న ర‌జనీ కాంత్ మూవీ

Jailer 450 Crores : త‌మిళ‌ నాట త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న త‌లైవా ర‌జ‌నీకాంత్ న‌టించిన జైల‌ర్(Jailer) రికార్డుల మోత మోగిస్తోంది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. ఏకంగా ఏడు రోజ‌ల‌లో రూ. 450 కోట్ల‌ను క్రాస్ చేసింది. సూప‌ర్ స్టార్ సినీ కెరీర్ లో మోస్ట్ పాపుల‌ర్ మూవీగా నిలిచి పోయింది.

Jailer 450 Crores Crossed

అందాల ముద్దుగుమ్మ త‌మ‌న్నా భాటియా , క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ రాజ్ కుమార్ , మ‌ల‌యాళ సూప‌ర్ హీరో మోహ‌న్ లాల్ క‌లిసి న‌టించిన జైల‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి నేటి దాకా క‌లెక్ష‌న్స్ కొల్ల‌గొడుతోంది. ఇటు ఇండియాతో పాటు ఓవ‌ర్సీస్ లో కూడా టాప్ లో నిలిచింది. ఇదే స‌మ‌యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ తేలి పోయింది. థియేట‌ర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ అట్ట‌ర్ ప్లాప్ గా నిలిచింది.

ఇక త‌లైవా విష‌యానికి వ‌స్తే త‌న మేన‌రిజంతో మ‌రోసారి మెస్మ‌రైజ్ చేశాడు. త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు. ఇదే విష‌యం గురించి త‌మ‌న్నా ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేసింది. 72 ఏళ్ల వ‌య‌సులో కూడా 18 ఏళ్ల యువ‌కుడిలా న‌టించాడంటూ కితాబు ఇచ్చింది.

క‌లెక్ష‌న్ల ప‌రంగా చూస్తే ఆగ‌స్టు 10న విడుద‌లైంది జైల‌ర్. తొలి రోజు 10న రూ. 95.78 కోట్లు, 11న రూ. 56.24 కోట్లు, 12న రూ. 68.51 కోట్లు, 13న రూ. 82.36 కోట్లు, 14న రూ. 49.03 కోట్లు, 15న రూ. 64.27 కోట్లు, 16న రూ. 34.61 కోట్లు వ‌సూలు చేసింది చిత్రం. మొత్తం ఏడు రోజుల‌కు గాను రూ. 450.80 కోట్లు కొల్ల‌గొట్టింది.

Also Read : CAG Comment : మోదీ పాల‌న‌లో క‌ర‌ప్ష‌నే కింగ్

Leave A Reply

Your Email Id will not be published!