CAG Comment : మోదీ పాల‌న‌లో క‌ర‌ప్ష‌నే కింగ్

ఆధారాల‌తో క‌డిగేసిన కాగ్

CAG Comment : అవినీతి, బంధుప్రీతి, కుటంబ రాజ‌కీయం అంటూ ప‌దే ప‌దే దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చెప్పే మాట‌లు ఏవీ ఆచ‌ర‌ణ‌లో ఉండ‌డం లేదు. ఈ విష‌యం తేటతెల్లం చేసింది కేంద్ర స‌ర్కార్ ఆధీనంలో ఉన్న కంట్రోలర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (CAG). తాజాగా ప్ర‌క‌టించిన నివేదిక క‌ల‌క‌లం రేపింది. ఎర్ర‌కోట సాక్షిగా ప‌దే ప‌దే త‌మ స‌ర్కార్ పాల‌న అద్బుతంగా ఉందంటూ చెబుతూ వ‌చ్చిన మాట‌లేవీ వాస్త‌వం కాద‌ని తేల్చేసింది.

ఓ వైపు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా , ఇంకో వైపు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ,ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంద‌రో . వారంద‌రి వార‌సులు, బంధువులు కీల‌క‌మైన ప‌ద‌వుల్లో కొన‌సాగుతున్నారు. ఇది బంధుప్రీతి కాదా అన్న‌ది మోదీకి తెలియ‌ద‌ని అనుకోలేం. అమిత్ షా కొడుకు బీసీసీఐ కార్య‌ద‌ర్శిగా ఉన్నాడు. రాజ్ నాథ్ సింగ్ త‌న‌యుడికి కీల‌కమైన ప‌ద‌వి. ఇక అనురాగ్ ఠాకూర్ త‌న‌యుడు ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (IPL) చైర్మ‌న్ గా కొన‌సాగుతున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కించ లేనంత మంది ఉన్నారు.

CAG Comment Viral

అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూ వ‌చ్చిన మోదీ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను నిర్వీర్యం చేయ‌డం, వాటిని బ‌డా బాబుల‌కు, వ్యాపార‌వేత్త‌ల‌కు అప్ప‌గించ‌డం లేదా లీజుకు ఇవ్వ‌డంపై ఫోక‌స్ పెట్టారు. ఇందు కోసం ఏకంగా డిజిన్వెస్ట్ మెంట్ పేరుతో ఓ శాఖ‌ను కూడా ఏర్పాటు చేశారు. దానికి చైర్మ‌న్ గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఉన్నారు. ఇక చెప్పుకుంటూ పోతే లిస్టు భారీగా ఉంది. అందుకే రైతు నేత రాకేశ్ టికాయ‌త్ అన్న‌ట్టు ఇది బీజేపీ ప్ర‌భుత్వం కాద‌ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని. ఇది ప‌క్క‌న పెడితే ప్ర‌తి ఏటా ప్ర‌భుత్వ శాఖ‌ల‌లో లావాదేవీలు, ఖ‌ర్చు ప‌ద్దుల గురించి ఆరా తీస్తుంది కాగ్(CAG). కొలువు తీరిన మోదీ స‌ర్కార్ ఏ ర‌కంగా అక్ర‌మాల‌కు పాల్ప‌డిందో కుండ బ‌ద్ద‌లు కొట్టింది. ఒక‌టి కాదు రెండు కాదు ఏడు శాఖ‌ల‌లో స్కామ్ లు చోటు చేసుకున్నాయి.

కేవ‌లం 18 కోట్ల‌కు బ‌దులు రూ. 250 కోట్లు వృధా చేశారంటూ ఆరోపించింది. ఎక్స్ ప్రెస్ వే నిర్మాణంలో భారీ కుంభకోణం చోటు చేసుకుంద‌ని చీవాట్లు పెట్టింది. ఢిల్లీ నుంచి గుర్ గ్రామ్ ను క‌లుపుతూ నిర్మిస్తున్నారు. కిలోమీట‌ర్ కు రూ. 18.20 కోట్ల‌తో సీసీఈఏ ఆమోదం తెలిపింద‌ని పేర్కొంది. అయితే కేంద్ర ర‌హ‌దారులు, ర‌వాణా మంత్రిత్వ శాఖ నిర్మాణ సంస్థ‌కు కిలోమీట‌ర్ కు రూ. 250.77 కోట్ల చొప్పున ఖ‌ర్చు మొత్తాన్ని మంజూరు చేసింద‌ని సీరియ‌స్ అయ్యింది. కేవ‌లం ఇది ఒక్క‌టి శాంపిల్ మాత్ర‌మే ఇలా మోదీ పాల‌న‌లో చోటు చేసుకున్న మ‌రో ఆరు ప‌థ‌కాల‌లో కూడా ఇదే రీతిన నిధులు ప‌క్క‌దారి ప‌ట్టాయ‌ని కాగ్ త‌లంటింది. ఏది ఏమైనా పాల‌కుల అవినీతికి ఇది ప‌రాకాష్ట అని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌జ‌లు మేల్కోనంత కాలం ఇలా మోస పోతూ ఉండాల్సిందే.

Also Read : PM Vishwakarma Yojana : పీఎం విశ్వ‌క‌ర్మ యోజ‌న

Leave A Reply

Your Email Id will not be published!