Tellam Venktrao Joined : గులాబీ గూటికి తెల్లం వెంకట్రావు
మాజీ ఎంపీ పొంగులేటికి బిగ్ షాక్
Tellam Venktrao Joined : ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు తెల్లం వెంకట్రావు తిరిగి స్వంత గూటికి చేరుకున్నారు. గురువారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు మరికొందరు సీనియర్ నాయకులు భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఆయనను ఐటీ , పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
Tellam Venktrao Joined in BRS
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్(KTR) పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. మంచికో చెడుకో పార్టీ నుండి బయటకు తెల్లం వెంకట్రావు వెళ్లారని , ఇప్పుడు తన ఇంటికి తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ అన్నాక అభిప్రాయ భేదాలు ఉండడం సహజమేనని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ను నమ్మి పార్టీలోకి వచ్చిన తెల్లం వెంకట్రావుకు మంచి భవిష్యత్తు తప్పక ఉంటుందన్నారు కేటీఆర్. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని సీట్లను గెలిపించుకునేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ కష్ట పడే వారిని గుర్తు పెట్టుకుంటుందని వారికి సముచిత స్థానం కల్పిస్తుందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. ఇదిలా ఉండగా తెల్లం వెంకట్రావు మాజీ ఎంపీ పొంగులేటికి అనుంగు అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఆయన వెంటనే కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. తాజాగా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
Also Read : CM KCR Condolence : కృష్ణారావు మృతి తీరని లోటు – కేసీఆర్