KC Venu Gopal : పేరు మార్చడం కక్ష సాధించడమే
కాంగ్రెస్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్
KC Venu Gopal : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venu Gopal) నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం కక్ష సాధింపుతో ఉన్నాయని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తాజాగా దివంగత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పేరుతో ఏర్పాటు చేసిన మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీకి సంబంధించి పేరు మార్చడం దారుణమన్నారు.
KC Venu Gopal Comments on Modi
ఇది నీచ రాజకీయాలకు, కక్ష సాధింపులకు పరాకాష్టగా ఉందన్నారు. ఇంతకంటే ఏం చేయగలరని ప్రశ్నించారు. ఇవాళ అధికారంలో మీరు ఉండవచ్చు. కానీ రేపు మేం రావచ్చు. ఇన్నేళ్ల కాలంలో కొన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. కానీ ఏనాడూ వ్యక్తిగత కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదని గుర్తు చేశారు. ఇకనైనా తమ తప్పు తెలుసు కోవాలని సూచించారు కేసీ వేణుగోపాల్ ప్రధాన మంత్రి మోదీకి.
ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ప్రతీకార రాజకీయాలను బట్ట బయలు చేసిందన్నారు. యావత్ ప్రపంచం జవహర్ లాల్ నెహ్రూను గౌరవిస్తుందన్నారు. కానీ బీజేపీ సర్కార్ మాత్రం ఆయనను కించ పరిచేలా చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు కేసీ వేణుగోపాల్.
Also Read : Tellam Venktrao Joined : గులాబీ గూటికి తెల్లం వెంకట్రావు
