Nara Lokesh : తాడేపల్లిలో తాగేందుకు నీళ్లు కరువు
సీఎం జగన్ రెడ్డిపై నారా లోకేష్ సెటైర్
Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. శుక్రవారం యువ గళం పాదయాత్రలో భాగంగా తాడేపల్లిగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు సీఎంపై. కృష్ణా నది పక్కనే ఉందని, కూత వేటు దూరంలోనే సీఎం ఉన్నాడని కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేష్. అధికారం ఉంటే సరి పోదని ఆదుకునే మనసు ఉండాలని స్పష్టం చేశారు.
Nara Lokesh Slams YS Jagan
తాడేపల్లి గూడెంలో ఉంటున్న ప్రజలకు కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. కనీస వసతులు ఏర్పాటు చేయడంలో జగన్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు నారా లోకేష్(Nara Lokesh). స్థానిక ప్రజలు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. చెవిటోని ముందు శంఖం ఊదినట్టుగా తయారైందని ఎద్దేవా చేశారు.
తాను తాడేపల్లి గూడెం మెయిన్ రోడ్డులో రూ. 5 లక్షల సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశానని చెప్పారు . ఉచితంగా స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు అధికారం ఒక్కటే సరి పోదన్నారు. 10 మందికి సాయ పడాలన్న మనసు కూడా ఉండాలన్నారు. దాచు కోవడం దోచు కోవడం తప్ప జగన్ మోహన్ రెడ్డికి ఏమీ తెలియదన్నారు.
Also Read : YS Sharmila : అడ్డుకున్న పోలీసులకు షర్మిల ఆశీర్వాదం