YS Sharmila : ప్ర‌శ్నిస్తే అడ్డుకుంటే ఎలా – ష‌ర్మిల‌

నిప్పులు చెరిగిన వైఎస్సార్ టీపీ చీఫ్

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం గ‌జ్వేల్ నియోక‌వ‌ర్గం జ‌గ‌దేవ్ పూర్ మండ‌లం తీగుల్ గ్రామంలో ద‌ళిత బంధు ప‌థ‌కంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని స్థానికులు ఆందోళ‌న చేప‌ట్టారు. వారికి సంఘీభావం తెలిపేందుకు వైఎస్ ష‌ర్మిల బ‌య‌లు దేరారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఆమెను ఇంటి వ‌ద్ద‌నే అడ్డుకున్నారు.

YS Sharmila Slams BRS

దీంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు వైఎస్సార్ టీపీ చీఫ్. మీడియాతో మాట్లాడిన ఆమె ఖాకీల‌పై , బీఆర్ఎస్ రాష్ట్ర స‌ర్కార్ పై, సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్న‌ది లేకుండా పోయింద‌న్నారు.

ఈ రాష్ట్రం ఏమైనా ఆఫ్గ‌నిస్తానా అని ప్ర‌శ్నించారు. బాధితుల‌ను ప‌రామ‌ర్శించాల‌ని అనుకోవ‌డం నేరం ఎలా అవుతుంద‌ని నిల‌దీశారు. తాను నేర‌స్థురాలిని కాన‌ని పేర్కొన్నారు. తాను ఎలాంటి అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌ని అన్నారు వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila). పోలీసులు ఉన్న‌ది ప్ర‌జ‌ల కోసం కానీ పాల‌కుల‌కు కాపలా కాయ‌డానికి కాద‌న్నారు .

త‌న‌ను అడ్డుకున్నందుకు ఖాకీల‌కు హారతి ఇచ్చాన‌ని అన్నారు. కేసీఆర్ నియంత పోక‌డ‌కు నిర‌స‌న‌గా ఇంటి ముందే నిరాహార‌దీక్ష చేప‌ట్టేందుకు రెడీ అయ్యాన‌ని, ప‌చ్చి నీళ్లు కూడా ముట్ట‌న‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Nara Lokesh : తాడేప‌ల్లిలో తాగేందుకు నీళ్లు క‌రువు

Leave A Reply

Your Email Id will not be published!