Bhola Shankar Loss : భోళా శంక‌ర్ న‌ష్టంతో నిర్మాత ప‌రేషాన్

మీడియా మౌనంగా ఉంటే ఎలా

Bhola Shankar Loss : మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి, త‌మ‌న్నా భాటియా, కీర్తి సురేష్, సుమంత్ క‌లిసి న‌టించిన భోళా శంక‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ సినిమా వ‌చ్చినా లేదా ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా తెలుగు మీడియా ఆహా ఓహో అంటూ ఊద‌ర‌గొట్టేవి. కానీ తాజాగా చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్(Bhola Shankar) బోల్తా ప‌డింది.

Bhola Shankar Loss Talk Viral

ఊహించ‌ని డిజాస్ట‌ర్ గా మిగిలింది. రూ. 100 కోట్ల‌కు పైగా భారీ బ‌డ్జెట్ తో తీశారు ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ సినిమా గురించి ఎక్క‌డా చ‌ర్చించిన దాఖ‌లాలు లేవు.

ఇప్ప‌టి వ‌ర‌కు భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన సినిమాలు బోల్తా ప‌డితే ఆ వెంట‌నే స్పందించ‌డం, వాటి గురించి లేని పోనివి రాయ‌డం గ‌తంలో జ‌రిగింది. ప్ర‌భాస్ , పూజా హెగ్డే న‌టించిన రాధే శ్యామ్ రూ. 86 కోట్లు మాత్ర‌మే క‌లెక్ష‌న్ చేసింది. ఇక మ‌హేష్ బాబు, ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించిన స్పైడ‌ర్ రూ. 49 కోట్లు, చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఆచార్య రూ. 45 కోట్లు వ‌సూలు చేసింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్ ను రూ. 140 కోట్లు ఖ‌ర్చు చేసి తీశారు. ఈ చిత్రం క‌లెక్ష‌న్లు కేవ‌లం రూ. 24 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయ‌ని ట్రేడ్ టాక్. మొత్తంగా నిర్మాతకు భారీ న‌ష్టం వాటిల్లింది.

Also Read : YS Sharmila : ప్ర‌శ్నిస్తే అడ్డుకుంటే ఎలా – ష‌ర్మిల‌

Leave A Reply

Your Email Id will not be published!