Bhagwant Mann : బాధిత కుటుంబాన్ని రక్షించిన సీఎం
పదవి అంటే గుర్తింపు కోసం కాదు బాధ్యత
Bhagwant Mann : సీఎం పదవి పేరు కోసం కాదని ప్రజలకు సేవ చేసేందుకని నిరూపించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. పంజాబ్ లో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. కుండ పోత వర్షాల తాకిడికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వయంగా రంగంలోకి దిగారు. బాధితులకు భరోసా కల్పించారు. అంతే కాదు వారిని రక్షించేందుకు తానే ముందు వరుసలో నిలిచారు.
Bhagwant Mann Service Viral
ప్రస్తుతం భగవంత్ మాన్ వైరల్ గా మారారు. ఏకంగా పంజాబ్ లోని వరదలో చిక్కుకున్న బాధిత కుటుంబాన్ని తానే రక్షించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు హెలికాప్టర్ లో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశలించారు. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడారు భగవంత్ మాన్(Bhagwant Mann). ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో హల్ చల్ చేస్తోంది.
ముఖ్యమంత్రి పదవి అంటే హంగు ఆర్భాటం, మందీ మార్బలంతో ఊరేగడం కాదని ప్రజలకు అవసరమైన సమయంలో ఆదుకోవడమని ప్రత్యక్షంగా నిరూపించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. ఇదిలా ఉండగా పంజాబ్ లోని హోషియార్ పూర్ లో వరదల్లో చిక్కుకున్న బాధిత కుటుంబాన్ని రక్షించారు. సీఎంను చూసి మిగతా సీఎంలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.
Also Read : Bhola Shankar Loss : భోళా శంకర్ నష్టంతో నిర్మాత పరేషాన్