Pawan Kalyan : నేరాలకు అడ్డాగా మారిన ఏపీ – పవన్
ఏపీ సీఎం జగన్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి పొలిటికల్ లీడర్ కాదన్నారు. ఆయన ఫక్తు వ్యాపారి అని ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నేరాలకు నిలయంగా మారిందన్నారు. తాను మొదటి నుంచీ చెబుతున్నానని , మిస్సింగ్ కేసులు ఎక్కువయ్యాయని అన్నారు. ఇవాళ అమ్మాయిలు చిత్తూరు జిల్లా నుంచి మాయం కావడం దానికి నిదర్శనమన్నారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan Slams YS Jagan
ఇక తాడేపల్లి గూడెంలో నేరాల తీవ్రత మరింత పెరిగిందన్నారు. ఉత్తరాంధ్ర లో పెద్ద ఎత్తున భూ దోపిడీ కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారం చేస్తున్నారని నిట్ట నిలువునా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వుతున్నారని ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్.
విశాఖలో 271 ఎకరాల్లో తవ్వకాలు జరిపి కడప లోని తన సిమెంట్ కర్మాగారానికి తరలిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలో ఉన్న వారికి వేల కోట్లు అక్రమంగా వెళుతున్నాయని ఆవేదన చెందారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). విశాఖలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు. గంజాయి, డ్రగ్స్ మత్తులో యువత తూగుతోందన్నారు.
Also Read : Madhu Yashki : బహుజన వీరుడు సర్వాయి పాపన్న