ST Somashekar Gowda : డీకే నా రాజ‌కీయ గురువు – బీజేపీ ఎమ్మెల్యే

ఎస్టీ సోమ‌శేఖ‌ర్ గౌడ షాకింగ్ కామెంట్స్

ST Somashekar Gowda : క‌ర్ణాట‌క‌కు చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే ఎస్టీ సోమ‌శేఖ‌ర్ గౌడ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏకంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన పీసీసీ చీఫ్‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. త‌న‌కు రాజ‌కీయ గురువు ఎవ‌రైనా ఉన్నారంటే అది డీకేనేనంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు. దీంతో కాషాయ పార్టీలో క‌ల‌క‌లం రేగింది. కాగా త‌మ ఎమ్మెల్యేతో మాట్లాడతాన‌ని చెప్పారు మాజీ సీఎం బ‌స్వ‌రాజ్ బొమ్మై.

ST Somashekar Gowda Sensational Comments

స‌హ‌కార రంగంలో తాను ఎదగ‌డానికి డీకే శివ‌కుమార్ ఎంత‌గానో తోడ్పాటు అందించార‌ని కొనియాడారు. డీకే న‌న్ను జేపీ న‌గ‌ర్ జాయింట్ సెక్ర‌ట‌రీగా చేశార‌న్నారు. ఆయ‌నే న‌న్ను ఉత్త‌ర‌హ‌ళ్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిగా నిల‌బెట్టారంటూ కాంగ్రెస్ మాజీ నేత‌, ప్ర‌స్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఎస్టీ సోమ శేఖ‌ర్ గౌడ్(ST Somashekar Gowda).

శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజ‌యం సాధించిన మూడు నెల‌ల త‌ర్వాత బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారాయి. 2019లో బీజేపీ స‌ర్కార్ ను స్థాపించేందుకు బీఎస్ య‌డ్యూర‌ప్ప‌కు సాయం చేయ‌డంలో తోడ్ప‌డిన 14 మంది ఎమ్మెల్యేల‌లో సోమ‌శేఖ‌ర్ కూడా ఉన్నారు.

Also Read : Pawan Kalyan : నేరాల‌కు అడ్డాగా మారిన ఏపీ – ప‌వ‌న్

Leave A Reply

Your Email Id will not be published!