TTD EO Dharma Reddy : వైద్యులు ప్రేమతో సేవలు అందించండి
పిలుపునిచ్చిన టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి
TTD EO Dharma Reddy : టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ కు వచ్చే రోగులకు వైద్యులు ప్రేమతో , నిబద్దతతో రోగులకు వైద్య సేవలు అందించాలని పిలుపునిచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి. స్విమ్స్ డైరెక్టర్ సదా భార్గవి ఆధ్వర్యంలో డాక్టర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈవో. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
TTD EO Dharma Reddy Instructions to Doctors
రోగులు వైద్యులను భగవంతుడి స్వరూపులుగా భావిస్తారని , తమపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా వైద్యులు కృషి చేయాలని ధర్మా రెడ్డి సూచించారు. సమాజంలో వైద్యులకు ప్రథమ స్థానం ఉందన్నారు. రోగుల పట్ల దయ కలిగి ఉండాలని పేర్కొన్నారు ఈవో. స్విమ్స్ అభివృద్దికి దోహద పడాలన్నారు.
తిరుపతిని ఒక మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు టీటీడీ కృషి చేస్తోందని ధర్మా రెడ్డి చెప్పారు. బర్డ్ , ఆయుర్వేద, చిన్నపిల్లల ఆస్పత్రుల పని తీరు మరింత మెరుగు పడిందని చెప్పారు. అదే స్థాయిలో స్విమ్స్ ఆస్పత్రి మరింత మెరుగ్గా పని చేసేందుకు వైద్యులు పని చేయాలని స్పష్టం చేశారు ఈవో.
డాక్టర్లు ఎంతో నైపుణ్యం కలిగి ఉన్నారని, సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలు, ఆపరేషన్లు టీటీడీ(TTD) అంద చేస్తోందని చెప్పారు. వేదాలలో దాగి ఉన్న మెడికల్ సైన్స్ విజ్ఞానాన్ని కూడా తీసుకోవాలని సూచించారు. డైరెక్టర్ నెలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి వైద్యుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు ఏవీ ధర్మా రెడ్డి.
Also Read : AP CM YS Jagan : విద్యార్థుల సమస్యలపై జగన్ ఫోకస్