TTD Tickets : న‌వంబ‌రు నెల ఆర్జిత సేవా టికెట్లు విడుద‌ల‌

వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

TTD Tickets : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది. భ‌క్తుల‌కు సౌక‌ర్య వంతంగా ఉండేలా షెడ్యూల్ ప్ర‌కారం న‌వంబ‌ర్ నెల శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్ల‌ను విడుద‌ల చేసింది. సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న , అష్ట ద‌ళ పాద ప‌ద్మారాధ‌న ఆర్జిత సేవ‌ల ఆన్ లైన్ ల‌క్కీ డిప్ కోసం ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది. శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల నుండి ప్రారంభ‌మైంది. ఈనెల 21 సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు న‌మోదు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది టీటీడీ. ల‌క్కీ డిప్ లో టికెట్లు పొందిన భ‌క్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖ‌రారు చేసుకోవాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.

TTD Tickets Will Open Tomorrow

ఇదిలా ఉండ‌గా స్వామి వారి క‌ళ్యాణోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, స‌హ‌స్ర దీపాలంకార‌ణ సేవా టికెట్ల‌ను ఆగ‌స్టు 22న ఉద‌యం 10 గంట‌ల‌కు విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డించింది టీటీడీ(TTD). వ‌ర్చువ‌ల్ సేవా టికెట్ల‌ను మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నుంది. ఇక అంగ ప్ర‌దక్షిణ టోకెన్ల కోటాను ఆగ‌స్టు 23న ఉద‌యం 10 గంట‌ల‌కు రిలీజ్ చేస్తుంది టీటీడీ. శ్రీ‌వాణి ట్ర‌స్టు బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్ల‌ను ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నుంది.

వృద్దులు, దివ్యాంగుల‌కు ద‌ర్శ‌న టోకెన్ల కోటాను ఆగ‌స్టు 23న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రిలీజ్ చేస్తుంది. ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం రూ. 300 టికెట్లు ఆగ‌స్టు 24న ఉద‌యం 10 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు టీటీడీ ప్ర‌క‌టించింది. తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో వ‌స‌తి గ‌దుల బుకింగ్ ఆగ‌స్టు 25న ఉద‌యం 10 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది టీటీడీ.

Also Read : TTD EO Dharma Reddy : వైద్యులు ప్రేమ‌తో సేవ‌లు అందించండి

Leave A Reply

Your Email Id will not be published!