Rajinikanth Touches : యోగి కాళ్లు మొక్కిన రజనీకాంత్
లక్నోలో సీఎం ను కలిసిన తలైవా
Rajinikanth Touches : సూపర్ స్టార్ రజనీకాంత్ విస్తు పోయేలా చేశారు. ఆయన యూపీలోని లక్నోలో సీఎం యోగి ఆదిత్యానాథ్ ను తన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా యోగి ఆశ్చర్య పోయేలా సూపర్ స్టార్ సీఎం పాదాలను తాకారు. నమస్కరించారు. యోగి ఆదిత్యానాథ్ వద్దన్నా వినిపించు కోలేదు. ఈ సందర్భంగా రజనీకాంత్ ను సాదరంగా ఆహ్వానించారు. ఆయనకు పుస్తకాన్ని, జ్ఞాపికను అందజేశారు.
Rajinikanth Touches UP CM Feet
తాజాగా ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్(Rajinikanth) , తమన్నా భాటియా, శివ రాజ్ కుమార్ , మోహన్ లాల్ ,యోగి బాబు, రమ్య కృష్ణతో కలిసి జైలర్ సినిమాలో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డుల మోత మోగిసింది. ఇప్పటికే రూ. 500 కోట్ల మార్క్ ను దాటేసింది. ఇంకెన్ని కోట్లు కొల్లగొడుతుందో తెలియదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
జైలర్ సినిమా ప్రదర్శన కోసం యూపీకి వచ్చారు రజనీకాంత్. ఈ సందర్బంగా సీఎంను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. సినిమా విజయం అన్నది తనకు తెలియదని, అది దేవుడి దయ వల్లనే అలా జరిగిందన్నారు మీడియాతో తలైవా. అంతకు ముందు జార్ఖండ్ లోని రాంచీకి వెళ్లారు. చిన్న మస్తా ఆలయాన్ని సందర్శించారు. యాగోదా ఆశ్రమంలో ధ్యానం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్నతో సమావేశం అయ్యారు. ఇదిలా ఉండగా యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య రజనీకాంత్ జైలర్ చూశానని అద్భుతంగా ఉందన్నారు.
Also Read : Muttagiri Yadagiri Reddy : ఎమ్మెల్యే కోసం మహిళ కంటతడి