MLA Tadikonda Rajaiah : టికెట్ రాలేదని ఏడ్చిన ఎమ్మెల్యే
రాజయ్య సీటు గోవిందా
MLA Tadikonda Rajaiah : ఆయన ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధి. వరంగల్ జిల్లా స్టేషన్ ఘణ్ పూర్ కు చెందిన ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య . కానీ భావోద్వేగాలను ఆపు కోలేక పోయారు. ఉన్నట్టుండి గుడి వద్దకు వెళ్లారు. అక్కడ పొర్లు దండం పెట్టారు. ఆపై బోరుమని ఏడ్చారు. కారణం ప్రజల కోసం ఏడ్చాడని అనుకుంటే పొరపాటు పడినట్లే. తనకు టికెట్ రానందుకు ఏడ్చినట్లు చెప్పారు తాడికొండ.
MLA Tadikonda Rajaiah Emotional
భారత రాష్ట్ర సమితి పార్టీ బాస్ , తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల లిస్టును ఖరారు చేశారు. మొత్తం 119 స్థానాలకు గాను 115 సీట్లు ప్రకటించారు. ఇందులో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రిక్త హస్తం చూపారు. వివిధ కారణాల రీత్యా వాళ్లకు టికెట్లు ఇవ్వలేదన్నారు.
ఎవరు కూడా బాధ పడ వద్దని అందరీకి తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య(MLA Tadikonda Rajaiah) కూడా ఉన్నారు. ఆయన చివరి వరకు తనకు సీటు వస్తుందని భరోసాతో ఉన్నారు.
కానీ ఇటీవల లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ మధ్యన మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కొని కేబినెట్ లో సీటు కోల్పోయారు. తాజాగా ఓ మహిళ రాజయ్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.
Also Read : kodali Nani : చిరంజీవిని పకోడి గాడని అనలేదు