Telangana Election Comment : కాంగ్రెస్..కమలం కింకర్తవ్యం
తెలంగాణలో గులాబీ దూకుడు
Telangana Election Comment : ప్రతిపక్షాలను దెబ్బ కొట్టడంలో గులాబీ బాస్ కీసీఆర్ ను మించినోడు లేడు. ఓ వైపు కేంద్రం ఎన్ని ఆరోపణలు చేసినా ఇంకో వైపు టీపీసీసీ బాస్ రేవంత్ రెడ్డి ఎన్ని వ్యక్తిగత విమర్శలతో హోరెత్తించినా తన రూటే సపరేట్ అంటూ చెప్పకనే చెప్పారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లం అనుకుంటూనే కేసీఆర్ బోల్తా కొట్టిండచంలో సక్సెస్ అయ్యాడు. అన్ని పార్టీల కంటే ముందు గానే భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను ప్రకటించాడు. ఇవాళ లేదా రేపు అనుకుంటూ నాన్చుతూ వచ్చిన కేసీఆర్ ఉన్నట్టుండి విస్తు పోయేలా చేశాడు.
Telangana Election Comment Viral
మొత్తం 119 స్థానాలకు సంబంధించి ఏకంగా 115 సీట్లను అనౌన్స్ చేశాడు. ఇందులో అత్యధిక శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించారు. ముందు నుంచీ తాను సిట్టింగ్ లకే ఇస్తానంటూ ప్రకటించారు. ఆ విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.
కేవలం ప్రకటించిన స్థానాలలో ఏడుగురికి హ్యాండ్ ఇచ్చారు. మిగతా 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు పెట్టారు. పెండింగ్ లో ఉంచారు. ఇదంతా పక్కన పెడితే రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అని ఢంకా బజాయిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ(BJP) బొక్క బోర్లా పడ్డాయని చెప్పక తప్పదు.
ఎంతో సమయం ఉన్నప్పటికీ ఎంత సేపు బీఆర్ఎస్ పై, కేసీఆర్(KCR) ను , ఆయన కుటుంబాన్ని తిట్టడంపైనే ఫోకస్ పెట్టాయి తప్పా తమ పార్టీలను మరింత బలోపేతం చేసుకోవాలన్న దానిపై ఫోకస్ పెట్టలేక పోయాయి.
విచిత్రం గతంలో ఎన్నడూ లేని రీతిలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న కాంగ్రెస్(Congress) పార్టీ ఊహించని నిబంధన పెట్టింది. ఎవరైనా సరే పోటీ చేయాలని అనుకున్న వాళ్లకు దరఖాస్తు ఫీజు నిర్ణయించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు, అభ్యంతరాలు వచ్చాయి.
ఓసీలైతే రూ. 50,000, బీసీలైతే రూ. 25,000 కట్టాలని. ఇప్పటి నుంచే ఓట్ల దుకాణం మొదలు పెట్టారా అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ కంటే ముందే అభ్యర్థులను ఖరారు చేసి ఉండి ఉంటే కొంత అడ్వాంటేజ్ గా ఉండేది. అదును చూసి దెబ్బ కొట్టడంలో కేసీఆర్ కు మించిన మొనగాడు లేడని తేలి పోయింది.
వ్యక్తిగత విమర్శలు చేయడంపై ఉన్నంత శ్రద్ద పార్టీ నిర్మాణం, బలోపేతం పై పెట్ట లేదన్న అపవాదు ఎదుర్కొంటున్నారు రేవంత్. ఇక కాషాయం సంగతికి వస్తే సేమ్ సీన్. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చారే తప్పా ఎక్కడా ఆధారాలు చూప లేక పోయారు. కాస్తో కూస్తో సర్కార్ పై యుద్దం ప్రకటించే నాయకుడిగా ఉన్న బండి సంజయ్ ను బీజేపీ చీఫ్ నుంచి తప్పించారు.
ఇప్పటి వరకు పార్టీ పరంగా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఇప్పటికే ఆ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోందని, ఉన్నత వర్గాలకు ప్రయారిటీ ఉందని, బహుజనులకు లేదన్న విమర్శలు ఉన్నాయి. మొత్తంగా తెలంగాణ పాలిటిక్స్ లో కాంగ్రెస్, కమలం ఏ మేరకు రాణిస్తాయో కేసీఆర్ ను ఎలా ఎదుర్కొంటాయో వేచి చూడాలి.
Also Read : MLA Tadikonda Rajaiah : టికెట్ రాలేదని ఏడ్చిన ఎమ్మెల్యే
