MP Dharmapuri Aravind : ఎవ‌రికి ఓటు వేసినా గెలుపు నాదే

బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్

MP Dharmapuri Aravind : బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్(MP Dharmapuri Arvind) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడార‌. మీరు ఎవ‌రికి ఓటు వేసినా చివ‌ర‌కు గెలిచేది నేనేని అన్నారు. మీరు నోటాకు ఓటు వేసినా, కారుకు ఓటు వేసినా లేదా ఇత‌రుల‌కు వేసినా ఆ ఓట్ల‌న్నీ నాకే వ‌స్తాయ‌ని షాకింగ్ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

MP Dharmapuri Aravind Comments Viral

మీరు దేనికి ఓటు గుద్దినా ఆ ఓటు ప‌డేది భార‌తీయ జ‌న‌తా పార్టీకేన‌ని గుర్తు పెట్టుకోవాల‌న్నారు. ఒక బాధ్య‌త క‌లిగిన ఎంపీ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం అవుతోంది. ఇప్ప‌టికే దేశ ఎన్నిక‌ల సంఘం ప‌నితీరుపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. ఇంతెందుకు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ దేశ రాష్ట్ర‌ప‌తిని, ప్ర‌ధాన మంత్రిని నిల‌దీసే లాగా ఉండాల‌ని కానీ అయ్యా అనే స్థితిలో ఉండ కూడ‌ద‌ని పేర్కొన్నారు. మొత్తంగా బీజేపీ తెలిసీ మాట్లాడాడా లేక తెలియ‌క మాట్లాడాడా అన్న‌ది ఆయ‌న‌కే తెలియాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేత‌లు ఎద్దేవా చేస్తున్నారు.

ప్ర‌జ‌ల‌కు , స‌మాజానికి జ‌వాబుదారీగా ఉండాల్సిన వాళ్లు బాధ్య‌తా రహితంగా కామెంట్స్ చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాదంటున్నారు.

Also Read : Telangana Election Comment : కాంగ్రెస్..క‌మ‌లం కింక‌ర్త‌వ్యం

Leave A Reply

Your Email Id will not be published!