Nara Lokesh : వైసీపీ స‌న్నాసుల‌కు షాకింగ్ ఇస్తా

హెచ్చ‌రించిన నారా లోకేష్

Nara Lokesh : టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆయ‌న చేప‌ట్టిన యువ గ‌ళం పాద‌యాత్ర ఉమ్మ‌డి కృష్ణా జిల్లాకు చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు నారా లోకేష్ పాద యాత్ర‌లో భాగంగా 191 రోజులు పూర్తి చేసుకున్నారు. అంత‌కు ముందు దివంగ‌త సీఎం నంద‌మూరి తార‌క రామారావు విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు.

Nara Lokesh Slams YSRCP Leaders

గ‌న్నవ‌రం నియోజ‌క‌వ‌ర్గం చినఅవుట‌ప‌ల్లి ఎస్ఎం క‌న్వెన్ష‌న్ హాలు క్యాంప్ సైటు నుంచి పాద‌యాత్ర ప్రారంభించారు నారా లోకేష్(Nara Lokesh). గ‌న్న‌వ‌రం స‌మీపంలోని అవుట‌ప‌ల్లిలో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌కు ప్ర‌జ‌లు భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా వైసీపీ నేత‌లను, సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. నేను ఎందుకు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని నిల‌దీశారు. వైకాపా కుక్క‌లు అమ్మ లాంటి అమ‌రావ‌తికి చేసిన ద్రోహానికి ముందు వారే సారీ చెప్పాల‌ని డిమాండ్ చేశారు నారా లోకేష్‌.

త‌న త‌ల్లిని అవ‌మానించిన స‌న్న బియ్యం స‌న్నాసి, పిల్ల సైకో వంశీలు ఇంకో త‌ల్లి పేరు ఎత్తాలంటే భ‌య‌ప‌డేలా షాక్ ట్రీట్మెంట్ ఇస్తాన‌ని హెచ్చ‌రించారు. వ‌చ్చేది టీడీపీ ప్ర‌భుత్వ‌మేన‌ని , అంద‌రి స‌మ‌స్య‌లు ప‌రిస్‌క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు నారా లోకేష్.

Also Read : MP Dharmapuri Aravind : ఎవ‌రికి ఓటు వేసినా గెలుపు నాదే

Leave A Reply

Your Email Id will not be published!