CM KCR Tour : సెప్టెంబర్ 8న కేసీఆర్ టూర్
భూపాలపల్లికి వస్తారన్న ఎమ్మెల్యే
CM KCR Tour : బీఆర్ఎస్ పార్టీ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. అన్ని పార్టీల కంటే ముందస్తుగా పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఒక రకంగా ఎన్నికల నగారా మోగించారు. ఇదే సమయంలో టికెట్లు రాని వాళ్లకు భరోసా ఇచ్చారు.
CM KCR Tour to Bhupalapalli
అక్టోబర్ లో వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహిస్తామని చెప్పారు కేసీఆర్. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 8న భూపాలపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి వెల్లడించారు.
సీఎం టూర్ లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ , ఎస్పీ కార్యాలయం , మెడికల్ కాలేజీలను కేసీఆర్(KCR) ప్రారంభిస్తారని చెప్పారు. అంతే కాకుండా మంజూర్ నగర్ లో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని తెలిపారు.
సీఎం పర్యటన ముందే ఖరారు కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు తీపి కబురు కూడా చెప్పనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో తిరిగి తామే మేమే పవర్ లోకి వస్తామని గండ్ర వెంకట రమణా రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Rekha Nayak Syam Nayak : టికెట్ కోసం భార్యభర్తల దరఖాస్తు