Rekha Nayak Syam Nayak : టికెట్ కోసం భార్యభర్తల దరఖాస్తు
ఎమ్మెల్యే రేఖా నాయక్..శ్యామ్ నాయక్
Rekha Nayak Syam Nayak : తనకు సీటు దక్కక పోవడంతో భారత రాష్ట్ర సమితి పార్టీకి గుడ్ బై చెప్పారు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్. తను కష్టపడి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించానని, మూడోసారి తనకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు రేఖా నాయక్.
Rekha Nayak Syam Nayak Joined in Congress
ఇదిలా ఉండగా బీఆర్ఎస్ బాస్, తెలంగాణ సీఎం ప్రగతి భవన్ వేదికగా రాబోయే ఎన్నికలకు సంబంధించి మొత్తం 119 అసెంబ్లీ సీట్లకు గాను 115 సీట్లకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో నాలుగు సీట్లను పెండింగ్ లో పెట్టారు.
కాగా ప్రకటించిన అభ్యర్థులలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపించారు. వారికి ఏదో రకంగా ఛాన్స్ ఇస్తానని ప్రకటించారు. ఎవరు కూడా ఆందోళన చెందవద్దని సూచించారు. అయినా ఖానా పూర్ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు. సీఎంపై భగ్గుమన్నారు.
రేఖా నాయక్(Rekha Nayak) కంటే ముందు భర్త శ్యామ్ నాయక్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. ఆ వెంటనే భార్య ఎమ్మెల్యే రేఖా నాయక్ సైతం హస్తం గూటికి చేరుకున్నారు. ఇద్దరూ కలిసి పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఖానాపూర్ నుండి ఎమ్మెల్యే రేఖా నాయక్, ఆసిఫాబాద్ నుండి ఆమె భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ నుండి దరఖాస్తు చేసుకున్నారు.
Also Read : Devineni Uma : నాని..వంశీపై రెచ్చి పోయిన ఉమ
