AP CM YS Jagan Comment : జ‌గ‌న్ ఫోక‌స్ స‌క్సెస్ పై న‌జ‌ర్

ప‌క్కా ప్లాన్ తో బ‌రిలోకి

AP CM YS Jagan Comment : ఏ మాత్రం ఓట‌మి అంటూ ఒప్పుకోని మ‌న‌స్త‌త్వం ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిది(AP CM YS Jagan). సుదీర్ఘ పాద‌యాత్ర‌తో ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన జ‌గ‌న్ ఎక్కువ‌గా సంక్షేమ ప‌థ‌కాల‌పై ఫోక‌స్ పెట్టారు. ప్ర‌త్యేకించి ఏ రాష్ట్రంలో లేని రీతిలో నాడు నేడు కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. బ‌డుల‌ను బాగు చేయ‌డం, మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించ‌డంపై ఫోక‌స్ పెట్టారు.

AP CM YS Jagan Comment Viral

డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ అన్న‌ట్టు ఈ దేశంలో కావాల్సింది ప్ర‌ధానంగా బ‌డులు, ఆస్ప‌త్రులు. వీటిపైనే దృష్టి సారించారు. ఇందు కోసం కొన్నికోట్ల అప్పులు తీసుకు వ‌చ్చినా ప్ర‌ధానంగా బ‌డ్జెట్ లో కూడా ప్ర‌యారిటీ ఇస్తూ వ‌చ్చారు. ప్ర‌త్యేకించి ఆయ‌న వ్య‌వ‌సాయ రంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్ర‌య‌త్నం చేశారు.

ఇందులో ఆర్బీకే సెంట‌ర్లు ఉన్నాయి. టెక్నాల‌జీని విద్య‌కు అనుసంధానం చేయాల‌న్న‌ది ఆయ‌న క‌ల‌. ఎందుకంటే ఇక్క‌డి విద్యార్థులు ప్ర‌పంచంతో పోటీ ప‌డాల‌ని. ఓ వైపు మాతృ భాష‌ను కాపాడుకుంటూనే ఎదిగేందుకు, అభివృద్ది సాధించేందుకు ఆంగ్ల మాధ్య‌మం కూడా అవ‌స‌ర‌మ‌ని భావించారు.

అందుకే ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా, అభ్యంత‌రాలు వ‌చ్చినా లెక్క చేయ‌లేదు. ఆంగ్లంలో ప్ర‌తి ఒక్క‌రు ప్రావీణ్యం సంపాదించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇక విశాఖ‌ను కేంద్రంగా చేసుకుని ఐటీని అభివృద్ది చేయాల‌న్నది ఆయ‌న ప్లాన్. దీనికి అనుగుణంగా ఆ మ‌ధ్య‌న స‌మ్మిట్ కూడా ఏర్పాటు చేశారు.

ప‌లు కంపెనీలు ఇక్క‌డ ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వ‌చ్చాయి. అత్యంత ప్రోత్సాహ వంత‌మైన , పార‌దర్శ‌క‌త‌తో కూడిన పాల‌సీని తీసుకు రావ‌డం, ప్ర‌తి ఒక్క‌రూ స్వేచ్ఛ‌గా పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌చ్చేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

విద్య‌, ఆరోగ్యం, ఉపాధి, వ్య‌వ‌సాయం , మ‌హిళా సాధికార‌త ఈ దిశ‌గా త‌ను ప్ర‌యారిటీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. భారీ ఎత్తున సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేయ‌డంతో రాష్ట్రంలోని అత్య‌ధిక జ‌నాభా వీటి ద్వారా ల‌బ్ది పొందుతున్నారు.

ఇక పార్టీ శ్రేణులు, నేత‌లు, మంత్రులకు గ‌డ‌ప గ‌డ‌ప ప్రోగ్రాం డిజైన్ చేశారు. దీని ద్వారా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న ఏ విధంగా ఉంద‌నేది అర్థం చేసుకునేందుకు వీలు క‌లిగేలా చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో మొత్తం స్థానాల‌ను క్లీన్ స్వీప్ చేయాల‌ని దిశా నిర్దేశం చేశారు.

ఆ దిశ‌గా వారిని కార్యోన్ముఖుల‌ను చేసే ప్ర‌య‌త్నం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ ఎవ‌రూ గీత దాట‌కుండా చూస్తున్నారు. మ‌రో వైపు ప్ర‌తిప‌క్షాలు ఎదురు దాడికి దిగినా తాను మౌనంగా ఉంటూ అన్నీ గ‌మ‌నిస్తున్నారు.

ఎక్కువ మాట్లాడ‌టం కంటే చేత‌ల్లో ప‌నులు చేసి చూపించ‌డ‌మే జ‌గ‌న్(Jagan) పాల‌సీ..ల‌క్ష్యం కూడా. అందుకే ఎన్ని తుపాకులు వాడామ‌న్న‌ది కాదు ఎన్ని బుల్లెట్లు స‌రిగా కొట్టామా లేదా అన్న‌ది ముఖ్యం అన్న సూత్రాన్ని పాటిస్తున్నారు. పాల‌నా ప‌రంగా కొన్ని వైఫ‌ల్యాలు ఉండ‌వ‌చ్చు..కానీ రేప‌టి భ‌విష్య‌త్తు కోసం ఇవాళ క‌ష్ట‌ప‌డ‌టం తప్ప‌ద‌ని చెబుతున్నారు.

జ‌గ‌న్ మామూలోడు కాదు..గ‌ట్స్ ఉన్నోడు..ద‌మ్మున్నోడు..మ‌రి ప్ర‌జ‌లు ఎవ‌రి వైపు నిల‌బ‌డ‌తార‌నేది కొద్ది కాలం ఆగితే గానీ చెప్ప‌లేం. ఇప్ప‌టికే అన్ని అస్త్రాల‌ను సిద్దం చేసుకున్న జ‌గ‌న్ ఏ మేర‌కు స‌క్సెస్ అవుతారో వేచి చూడాలి.

Also Read : Patnam Mahender Reddy : ముహూర్తం ఫిక్స్ ఇంకా స‌స్పెన్స్

Leave A Reply

Your Email Id will not be published!