Allu Arjun : బ‌న్నీ ఇంట్లో సెల‌బ్రేష‌న్స్

జాతీయ ఉత్త‌మ న‌టుడిగా ఎంపిక

Allu Arjun : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జాతీయ స్థాయిలో ఉత్త‌మ నటుడి అవార్డు ద‌క్కింది. దీంతో ఆయ‌న అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. శుక్ర‌వారం బ‌న్నీ నివాసంలో గ్రాండ్ గా సెల‌బ్రేష‌న్స్ జ‌రిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు సుకుమార్ , నిర్మాత‌లతో పాటు అల్లు అర్జున్ తండ్రి, ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ , కూతురు , భార్య స్నేహారెడ్డి కూడా ఉన్నారు.

Allu Arjun Got National Award

సినిమా రంగానికి చెందిన ప‌లువురు న‌టులు, సాంకేతిక నిపుణులు ఐకాన్ స్టార్(Allu Arjun) కు అభినంద‌న‌లు తెలిపారు . ప్ర‌ముఖ న‌టులు బాల‌కృష్ణ, చిరంజీవి, వెంక‌టేశ్, జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ తేజ‌, మ‌హేష్ బాబు, ర‌వి తేజ కంగ్రాట్స్ తెలిపారు.

ఇదిలా ఉండ‌గా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంగా పుష్ప ది రైజ్ పేరుతో సినిమా తీశాడు. ఇది దేశ వ్యాప్తంగా వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. బ‌న్నీ కెరీర్ లో టాప్ సినిమాగా నిలిచింది.

ప్ర‌త్యేకించి పుష్పలో అద్భుత‌మైన మేన‌రిజం, డైలాగుల‌తో దుమ్ము రేపాడు అల్లు అర్జున్. ఈ సినిమాకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్ర‌సాద్ కు ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక‌య్యాడు. అంతే కాకుండా ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా బుచ్చిబాబు ఉప్పెన పుర‌స్కారం ద‌క్కించుకుంది.

Also Read : Balakrishna : బ‌న్నీ..బుచ్చిబాబుకు బాల‌య్య కంగ్రాట్స్

Leave A Reply

Your Email Id will not be published!