Vijay Devarakonda : తిలక్ వర్మకు విజయ్ కంగ్రాట్స్
తుది జట్టులో ప్లేస్ దక్కడం గ్రేట్
Vijay Devarakonda : ఆసియా కప్ టోర్నీలో భాగంగా ప్రస్తుతం ఆడుతున్న భారత క్రికెట్ జట్టులో హైదరాబాద్ కు చెందిన తిలక్ వర్మకు చోటు లభించడం ఆనందంగా ఉందన్నాడు ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ తో జరిగిన ప్రత్యేక సంభాషణలో ఈ విషయం ప్రత్యేకంగా పంచుకున్నాడు.
Vijay Devarakonda Congratulated to Tilak Varma
క్రికెట్ అంటే తనకు ఇష్టమని, దానిని తెగ ఎంజాయ్ చేస్తానని చెప్పాడు. చిన్నప్పటి నుంచి తనకే కాదు తన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికీ క్రికెట్ అంటే ఇష్టమని పేర్కొన్నాడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). భారత్ , పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ఉత్కంఠ భరిత పోరును తాను ఎప్పటికీ చూడాలని అనుకుంటానని స్పష్టం చేశాడు.
ఇదిలా ఉండగా తాను సమంత రుత్ ప్రభుతో కలిసి నటించిన తాజా చిత్రం ఖుషీ సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాను ఎలాంటి ఆందోళనకు గురి కావడం లేదన్నారు. కథలో దమ్ముంటే సినిమా అదంతకు అదే ఆడుతుందన్నాడు విజయ్ దేవరకొండ. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ , విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్ల సరసన మన తెలుగు వాడు ఆడడం నిజంగా తనకు గర్వ కారణంగా ఉందన్నాడు .
అంతే కాదు పాండ్యా, సిరాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో ఆటగాడు వెరీ వెరీ స్పెషల్ అని పేర్కొన్నాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను గుర్తు చేసుకున్నాడు.
Also Read : Vidadala Rajini Jagan : జగనన్నకు రాఖీ కట్టిన రజని