BAN vs SL Asia Cup 2023 : బంగ్లాపై లంకేయుల విక్టరీ
5 వికెట్ల తేడాతో విజయం
BAN vs SL Asia Cup 2023 : ఆసియా కప్ 2023లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్ లో శ్రీలంక బంగ్లాదేశ్(BAN vs SL Asia Cup 2023) జట్టుకు షాక్ ఇచ్చింది. 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. మతీశ పతిరణ శ్రీలంక గెలుపులో కీలక పాత్ర పోషించాడు. సదీర సమర విక్రమ, చరిత్ అసలంక, పతిరణ అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. శ్రీలంకలోని పల్లెకెలలో ప్రారంభ మ్యాచ్ జరిగింది.
BAN vs SL Asia Cup 2023 Viral
సదీర సమర విక్రమ , చరిత్ అసలంక చెరో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు. పేసర్ పతిరణ కేవలం 32 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు. బంగ్లాదేశ్ జట్టును 164 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఆతిథ్య జట్టు 77 బంతుల్లో 54 రన్స్, అసలంక 92 బంతుల్లో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. 39 ఓవర్లలో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసింది శ్రీలంక.
ఇక బంగ్లాదేశ్ జట్టులో 122 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లతో 89 రన్స్ చేశాడు నజ్ముల్ శాంటో. బంగ్లా దేశ్ స్కిప్పర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మహేశ్ తీక్షణ కేవలం 19 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. అయినా లాభం లేకుండా పోయింది. ఇక ఆసియా కప్ టోర్నీలో తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ నేపాల్ ను చిత్తు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన రికార్డు స్వంతం చేసుకున్నాడు.
Also Read : AP CM YS Jagan : భూ సంస్కరణలపై ప్రచారం చేయాలి