IND vs PAK Asia Cup 2023 : దాయాదుల పోరుపై ఉత్కంఠ
శనివారం నువ్వా నేనా భారత్..పాక్
IND vs PAK Asia Cup 2023 : ఆసియా కప్ 2023లో భాగంగా అసలైన పోరుకు వేదిక కానుంది శ్రీలంకలోని క్యాండీ స్టేడియం. ఇప్పటికే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 2 శనివారం నాడు జరిగే మ్యాచ్(IND vs PAK Asia Cup 2023) కు అన్ని హోటళ్లు పూర్తిగా నిండి పోయాయి. దీంతో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
IND vs PAK Asia Cup 2023 Match Tomorrow
భద్రతా కారణాల దృష్ట్యా భారత్ ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ లో పాక్ తో ఆడేది లేదంటూ స్పష్టం చేసింది బీసీసీఐ. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు బీసీసీఐ కార్యదర్శి జే షా. దీంతో ఇరు దేశాల మధ్య కొంత అనిశ్చితి ఏర్పడింది. దీనిని పటా పంచలు చేస్తూ ఏసీసీ తటస్థ వేదికలపై ఆడేందుకు సిద్దమని ప్రకటించింది.
దీంతో ప్రస్తుతం ఆసియా కప్ ఆరు జట్లతో కొనసాగుతోంది. గత ఏడాది ఛాంపియన్ గా ఉన్న శ్రీలంక తో పాటు పాకిస్తాన్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇదిలా ఉండగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడనుండడంతో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ కీలక మ్యాచ్ కు సంబంధించి ఆన్ లైన్ , ఆఫ్ లైన్ టికెట్లు పూర్తిగా అయి పోయాయి. దీంతో ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.
Also Read : BAN vs SL Asia Cup 2023 : బంగ్లాపై లంకేయుల విక్టరీ