Corruption Comment : అవినీతి పరంపర ఫిర్యాదుల వెల్లువ
అమిత్ షా శాఖలోనే ఎక్కువ
Corruption Comment : అవినీతి లేని ప్రభుత్వం తమదంటూ నిత్యం బీరాలు పలికే మోదీ కొలువు తీరిన కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన శాఖలైన హొం మంత్రిత్వ శాఖ, రైల్వేలు, బ్యాంకులపై అవినీతి పెద్ద ఎత్తున చోటు చేసుకుందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇదేదో సామాన్యులు కావాలని ఆరోపణలు చేశారని అనుకుంటే పొరపాటు పడినట్లే. మోదీ ప్రధానమంత్రి అయినప్పటికీ ఇవాళ పాలనను కంట్రోల్ చేస్తున్నది, అన్ని వ్యవహారలను దగ్గరుండి నడిపిస్తున్నది మాత్రం ఏకైక వ్యక్తి. ట్రబుల్ షూటర్, కింగ్ మేకర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షానే(Amit Shah). ఇది జగమెరిగిన సత్యం.
Corruption Comment Viral
కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన ఏకైక క్రీడా సంస్థ బీసీసీఐ కూడా షా తనయుడు జే షా కనుసన్నలలో నడుస్తోంది. మరో వైపు సహకార వ్యవస్థలో వేల కోట్లు మూలుగుతున్నాయి. భారీ ఎత్తున లావాదేవీలు కొనసాగుతున్నాయి. విచిత్రం ఏమిటంటే గత ఏడాది 2022లో హోం మంత్రిత్వ శాఖ , రైల్వే లు , బ్యాంకులలో అత్యధికంగా అవినీతి చోటు చేసుకుందని ఫిర్యాదులు వచ్చాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) నివేదిక వెల్లడించింది.
విస్తు పోయేలా నిజాలు వెల్లడయ్యాయి. హోం మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులపై గత ఏడాది 46 వేల 643 ఫిర్యాదులు రాగా రైల్వే శాఖలో 10, 580 , బ్యాంకులకు సంబంధించి 8,129 ఫిర్యాదులు వచ్చినట్లు కుండ బద్దలు కొట్టింది.
సీవీసీ తాజా నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలలో అన్ని కేటగిరీల అధికారులు, ఉద్యోగులపై ఏకంగా 1,15,203 ఫిర్యాదులు రావడం విస్తు పోయేలా చేసింది. ఇంకా పరిష్కారం కానివి 29,766 ఉన్నాయి. సీవీసీ ఇచ్చిన రిపోర్ట్ పై పెద్ద ఎత్తున విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఢిల్లీ లోని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ సర్కార్ ఉద్యోగులపై కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదు కావడం గమనార్హం.
సీబీడీటీ, రక్షణ మంత్రిత్వ శాఖ , టెలి కమ్యూనికేషన్ శాఖ , ఆర్థిక మంత్రిత్వ శాఖ , సీబీఐసీ, బీమా కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులపై ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా ఫిర్యాదులు , పెన్షన్ల మంత్రిత్వ శాఖ, ఉక్కు శాఖల్లో కూడా రావడం వారి పనితీరును అద్దం పట్టేలా చేస్తోంది. మొత్తంగా అంతా తానై వ్యవహరిస్తున్న షా మరి ఇప్పుడు ఏం సమాధానం చెపుతారో వేచి చూడాలి.
Also Read : PM Modi Congrats : మీ విజయం దేశానికి గర్వకారణం