Heavy Rains : భారీ వర్షం అతలాకుతలం
తెలంగాణలో కురుస్తున్న వర్షాలు
Heavy Rains : బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండ పోత వర్షంతో జన జీవనం స్తంభించి పోయింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి.
Heavy Rains in AP & TS
ఇరు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలలో వానలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్(Hyderabad) తో పాటు శివారు ప్రాంతాలన్నీ వర్షాల తాకిడికి తల్లడిల్లాయి. కిలోమీటర్ల పొడవునా నగరంలో వాహనాలు నిలిచి పోయాయి. మూడు గంటలకు పైగా ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురిశాయి.
రాజేంద్ర నగర్ , అత్తాపూర్ , కాటేదాన్ , నార్సింగి, మణికొండ, గండిపేట, బండ్లగూడలో వానలు దంచికొడుతున్నాయి. రోడ్లు జలమయం అయ్యాయి. పలు కాలనీలలోకి నీరు వచ్చి చేరింది. చాలా చోట్ల విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో కాలనీ వాసులు లబోదిబోమంటున్నారు.
భారీ వర్షాల దెబ్బకు రోడ్లు కనిపించకుండా పోయాయి. దీంతో వాహనదారులు తమ వాహనాలను నిలిపి ఉంచారు. ఇక ఉప్పర్ పల్లి 191 పిల్లర్ వద్ద వరద నీరు చేరింది. వాహనాలు పెద్ద ఎత్తున నిలిచి పోయాయి. శివరాంపల్లి 296 వద్ద రహదారి చెరువును తలపిస్తోంది.
Also Read : One Nation One Election : వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమేనా