Prashant Kishor : తెలంగాణలో గులాబీదే జెండా – పీకే
ముచ్చటగా మూడోసారి పవర్ లోకి
Prashant Kishor : ఢిల్లీ – భారతీయ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా త్వరలో దేశంలోని ఆయా రాష్ట్రాలలో జరిగే శాసనసభ ఎన్నికలపై కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Prashant Kishor Comments Viral
తెలంగాణలో తిరిగి భారత రాష్ట్ర సమితి పార్టీ తిరిగి మూడోసారి పవర్ లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇటీవల ఏర్పాటైన ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి గణనీయంగా ఓటు బ్యాంకు పెరగనుందని, కొన్ని సీట్లు వస్తాయని జోష్యం చెప్పారు.
మధ్య ప్రదేశ్ లో బీజేపీకి ఛాన్స్ ఉందన్నారు. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. సీట్ల షేరింగ్ లో ఆలస్యం చేస్తే బీజేపీకి అడ్వాంటేజ్ గా మారనుందని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
మొత్తంగా బీజేపీ పరంగా చూస్తే మోదీ మరోసారి ప్రధానమంత్రిగా కొలువు తీరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఇండియా కూటమిని తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదన్నారు. ప్రజలు సుస్థిరమైన పాలన కోరుకుంటున్నారని తనకు అనిపిస్తోందన్నారు. పీకే(Prashant Kishor) చేసిన కామెంట్స్ తో బీఆర్ఎస్ లో సంతోషం వ్యక్తం అవుతోంది.
Also Read : Paramhamsa Acharya : ఉదయనిధి తలకు ‘వెల’