IND vs PAK Asia Cup 2023 : దాయాదుల మ్యాచ్ కు టికెట్స్ క్లోజ్
రూ.59 లక్షలు వసూలు
IND vs PAK Asia Cup 2023 : శ్రీలంక – ఆసియా కప్ 2023లో భాగంగా శ్రీలంక వేదికగా క్యాండీలో జరగబో దాయాదులైన పాకిస్తాన్ , భారత్ జట్ల(IND vs PAK Asia Cup 2023 ) మధ్య జరిగే మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి. భారత్, పాకిస్తాన్ తలపడ్డాయి. వర్షం ఆటంకం కలిగించింది. దీంతో అంపైర్లు చెరో పాయింట్ కేటాయించారు.
IND vs PAK Asia Cup 2023 Tickets Housefull
ఆ తర్వాత నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. గ్రూప్ -4 కు చేరుకుంది భారత జట్టు. పాకిస్తాన్ టాప్ లో నిలిచింది. ఇప్పటికే ఆ జట్టు రెండు మ్యాచ్ లలో గెలుపొందింది. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు ఇరు జట్లు సిద్దమయ్యాయి.
దీంతో ఈ మ్యాచ్ సెప్టెంబర్ 10న శ్రీలంకలోని క్యాండీ వేదికగా అసలైన పోరు జరగనుంది. ముందస్తుగా పాకిస్తాన్, భారత దేశానికి చెందిన క్రికెట్ అభిమానులు వేలం వెర్రిగా కొనుగోలు చేసేశారు. దీంతో టికెట్లు దొరకక ఫ్యాన్స్ తంటాలు పడుతున్నారు. ముందస్తుగా అన్ని టికెట్లను అమ్మేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఆసియా కప్ ను ఈసారి హైబ్రిడ్ పద్దతిలో నిర్వహిస్తున్నారు. గత ఏడాది శ్రీలంక ఆసియా కప్ ను ఎగరేసుకు పోయింది. భారత్ ముందే ఇంటి బాట పట్టింది. ఫైనల్ లో శ్రీలంక, పాకిస్తాన్ తలపడ్డాయి. శ్రీలంక గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఈ మొత్తం టికెట్లు అమ్మగా దాదాపు రూ. 59 లక్షలకు పైగా వచ్చినట్లు సమాచారం.
Also Read : Adimulapu Suresh : మంత్రి కామెంట్స్ టీచర్స్ సీరియస్