Krishnamachari Srikanth : శార్దూల్ ఎంపికపై శ్రీకాంత్ ఫైర్
బీసీసీఐ సెలెక్షన్ సరిగా లేదు
Krishnamachari Srikanth : చెన్నై – భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ , కామెంటేటర్ , మాజీ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మెంబర్ కృష్ణమాచారి శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో త్వరలో భారత దేశంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనుంది.
Krishnamachari Srikanth Comments Viral
ఇందులో భాగంగా 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఏ మాత్రం పర్ ఫార్మెన్స్ లేని శార్దూల్ ఠాకూర్ ను ఎలా ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించాడు. టీమ్ ఎంపిక పూర్తిగా పారదర్శకంగా లేదని మండిపడ్డాడు కృష్ణమాచారి శ్రీకాంత్.
ప్రస్తుతం శ్రీకాంత్(Krishnamachari Srikanth) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ముంబై లాబీయింగ్ పూర్తిగా ఇతర ఆటగాళ్లను రానీయడం లేదన్న ఆరోపణలు లేక పోలేదు.
ఈ సమయంలో వన్డే ఫార్మాట్ లో ఏ మాత్రం ప్రతిభ కనబర్చని సూర్య కుమార్ యాదవ్ ను ఎంపిక చేయడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. విచిత్రం ఏమిటంటే యాదవ్ స్ట్రైక్ రేట్ దారుణంగా ఉంది.
ఇక కేరళ స్టార్ సంజూ శాంసన్ స్ట్రైక్ రేట్ 50కి పైగా ఉన్నా పట్టించు కోలేదు. మొత్తంగా వరల్డ్ కప్ జట్టు ఎంపిక పై శ్రీకాంత్ చేసిన విమర్శలు బీసీసీఐకి షాక్ ఇచ్చేలా ఉన్నాయి.
Also Read : Meghalaya CM : కేసీఆర్ ను కలిసిన మేఘాలయ సీఎం