Rajasthan Royals : యార్క్ షైర్ కౌంటీకి ఆర్ఆర్ ఆఫర్
రూ. 260 కోట్లు చెల్లించేందుకు బిడ్
Rajasthan Royals : ఇంగ్లండ్ – ఇండియన్ ప్రిమీయర్ లీగ్ లో కీలకంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఇంగ్లండ్ లో టాప్ లో కొనసాగుతున్న యార్క్ షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా రూ. 260 కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు దానిని కైవసం చేసుకునేందుకు ఓకే చెప్పింది. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో ఇది విస్తు పోయేలా చేసింది.
Rajasthan Royals Comments Viral
యార్క్ షైర్ కౌంటీ అత్యంత పురాతనమైనది. ఇంగ్లండ్ లో భారీ డిమాండ్ ఉంది. దిగ్గజ ఆటగాళ్లు ఈ కౌంటీలో ఆడతారు. కౌంటీ మ్యాచ్ లు నిత్యం కొనసాగుతుంటాయి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టుకు కేరళ స్టార్ సంజూ శాంసన్ సారథ్యం వహిస్తున్నాడు.
పెద్ద ఎత్తున బిడ్ ను ఆఫర్ చేయడం విస్తు పోయేలా చేసింది క్రీడాభిమానులను. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలను వరల్డ్ వైడ్ గా కొనుగోలు చేస్తూ పోతోంది. భారీ ఎత్తున క్రికెటర్లను కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు శాంసన్ కెప్టెన్ కాగా కుమార సంగక్కర హెడ్ కోచ్ గా ఉన్నాడు.
ఇక ఇంగ్లండ్ క్రికెట్ క్లబ్ లో యార్క్ షైర్ కౌంటీ కి 160 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం సదరు క్లబ్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు బార్బడోస్ రాయల్స్ , పార్ల్ రాయల్స్ లో ఫ్రాంచైజీలను కలిగి ఉంది. ఇక ఈ జట్టు యజమానలలో ఒకరు మనోజ్ బదలే లండన్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కావడం విశేషం.
Also Read : Krishnamachari Srikanth : శార్దూల్ ఎంపికపై శ్రీకాంత్ ఫైర్