Chandrababu Skill Scam Comment : బాబు స్కిల్ స్కామ్ క‌థేంటి

రూ. 371 కోట్ల గోల్ మాల్

Chandrababu Skill Scam Comment : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది టీడీపీ చీఫ్ , ఏపీ మాజీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ వ్య‌వ‌హారం. ఇప్ప‌టికే తన‌ను అరెస్ట్ చేయ‌వ‌చ్చు అంటూ ముందస్తుగానే ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు నంద్యాల‌లో ఉన్న ఆయ‌న‌ను ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఎఫ్ఐఆర్ లో త‌న పేరు లేద‌ని, ఎందుకు అరెస్ట్ చేస్తారంటూ ప్ర‌శ్నించారు చంద్ర‌బాబు. రిమాండ్ రిపోర్ట్ లో అన్ని వివ‌రాలు ఉన్నాయ‌ని, త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ స్కీం స్కామ్ కు సంబంధించి అరెస్ట్ చేసిన‌ట్లు ఏపీ సీఐడీ చీఫ్ ఎన్. సంజ‌య్ ప్ర‌క‌టించారు. ఈ మొత్తం స్కాంకు ప్ర‌ధాన సూత్ర‌ధారి, పాత్ర‌ధారి చంద్ర‌బాబు నాయుడేన‌ని స్ప‌ష్టం చేశారు.

Chandrababu Skill Scam Comment Viral

ఫైబ‌ర్ నెట్, ఇన్న‌ర్ రోడ్ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు నాయుడు(Chandrababu) త‌న‌యుడు నారా లోకేష్ పాత్ర ఉంద‌ని, అత‌డిని కూడా అరెస్ట్ చేసి విచారిస్తామ‌ని పేర్కొన్నారు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ. 371 కోట్ల స్కాం చోటు చేసుకుంద‌ని వెల్ల‌డించారు. కేబినెట్ లో ఎలాంటి తీర్మానం లేకుండానే ఏపీఎస్డీసీని ఏర్పాటు చేశారని చెప్పారు. షెల్ కంపెనీల ద్వారా డ‌బ్బులు చేతులు మారాయ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. విచార‌ణ సంద‌ర్భంగా ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ప్ర‌భావితం చేసేందుకు ఛాన్స్ ఉంద‌ని అందుకే అరెస్ట్ చేయాల్సి వ‌చ్చింద‌న్నారు. ఇక స్కిల్ స్కామ్ కు సంబంధించి చూస్తే 2014లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సిమెన్స్ సెంట‌ర్స్ ఆఫ్ ఎక్స‌లెన్స్ ల పేరుతో క్ల‌స్ట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ కూడా చేసింది.

సాంకేతిక భాగ‌స్యాముల్యుగా సిమెన్స్ , డిజైన్ టెక్ సంయుక్తంగా 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా , ప్ర‌భుత్వం 10 శాతంగా ఇచ్చేలా ఇందులో పొందుప‌ర్చారు. మొత్తం ప్రాజెక్టు ఖ‌ర్చు రూ. 3,300 కోట్లుగా నిర్ణ‌యించారు. ఈ మేర‌కు అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకున్నారు. సిమెన్స్ కంపెనీ తాము ఎలాంటి సంతకం చేయ‌లేద‌ని ప్ర‌క‌టించింది.

ఆనాటి ఒప్పందంపై సంత‌కం చేసిన వారిలో చంద్ర‌బాబు(Chandrababu), కె.అచ్చెన్నాయుడు ఉన్నారు. ఈ అవినీతి కుట్ర కేసులో అప్ప‌టి మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు హ‌స్తం కూడా ఉంద‌ని ఏపీ సీఐడీ స్ప‌ష్టం చేసింది. కేబినెట్ ప‌ర్మిష‌న్ లేకుండా ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ ను ఏర్పాటు చేసింది.

అవగాహన ఒప్పందం (MOU) రూపొందించబడింది, కానీ సిమెన్స్ మరియు డిజైన్ టెక్ అందించిన 90% సహకారం గురించి ప్రస్తావించబడలేదు. ఈ ఎంఓయూను చంద్రబాబు నాయుడు, కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు ఇద్దరూ ఆమోదించారు. ఈ కుట్రలో అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు హస్తం ఉందని సీఐడీ ఆరోపిస్తూ, మంత్రి మండలిని దాటవేసి నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ముంద‌స్తుగా రూ. 371 కోట్లు విడుద‌ల చేసింది. వెంట‌నే రిలీజ్ చేయాలంటూ ఆనాటి సీఎం ఆదేశించారని అప్ప‌టి సీనియ‌ర్ అధికారి ఒక‌రు నోట్ రాశారంటూ సీఐడీ చీఫ్ వెల్ల‌డించారు. డ‌బ్బుల‌ను షెల్ కంపెనీలు, న‌కిలీ ఇన్ వాయిస్ ల ద్వారా మ‌ళ్లించార‌ని ఆరోపించారు. నిధుల దుర్వినియోగంలో చంద్ర‌బాబు(Chandrababu) నాయుడు, ఇత‌ర నేత‌లు ప్ర‌ధాన కుట్ర‌దార‌లంటూ డీజీపీ ప్ర‌క‌టించారు.

అప్ప‌టి ప్ర‌భుత్వ సీఎస్ ఐవైఆర్ కృష్ణా రావు, ఆర్థిక కార్య‌ద‌ర్శి పీవీ ర‌మేష్ , స్పెష‌ల్ సీఎస్ ఆర్థిక శాఖ కె. సునీత‌తో స‌హా సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్లు కార్పొరేష‌న్ కు సంబంధించిన ఫైళ్ల‌లో నోట్స్ ద్వారా ప్ర‌స్తావించారంటూ తెలిపారు. డిజైన్ టెక్ కు ముంద‌స్తుగా నిధులు విడుద‌ల చేయాల‌ని ఆనాటి సీఎం చంద్ర‌బాబు ఆదేశించార‌న్నారు.

ఇందులో వికాస్ నాయ‌క్ ప్ర‌ధాన సూత్ర‌ధారిగా ఉన్నార‌ని పేర్కొన్నారు. ఈ మొత్తం స్కాం కేసులో ఈడీ, ఐటీ, గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ టాక్స్ , ఇంటెలిజెన్స్ వింగ్ కూడా ఈ ద‌ర్యాప్తులో పాల్గొన్నాయ‌ని సీఐడీ చీఫ్ స్ప‌ష్టం చేశారు. డిజైన్ టెక్ కు చెల్లించిన కోట్ల‌లో కేవ‌లం రూ. 58.8 కోట్లు మాత్ర‌మే త‌మ‌కు వ‌చ్చాయ‌ని సిమెన్స్ ఎండీ సౌమ్యాద్రి శేఖ‌ర్ తెలిపారు. ఆనాటి ఎండీ ఖాన్విల్క‌ర్ రూ. 241 కోట్లు స్వాహా చేశారు. ఇదే స‌మ‌యంలో స్కిల్ల‌ర్ ఎంట‌ర్ ప్రైజెస్ ఇండియా కంపెనీకి మాజీ ఆర్థిక స‌ల‌హాదారు , సంత‌కం చేసిన బోస్ , ఖాన్విల్క‌ర్ , ముకుల్ చంద్ర అగ‌ర్వాల్ , సీఏ సురేష్ గోయెల్ ల‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ మొత్తం వ్య‌వ‌హారం తీగ లాగితే డొంకంతా క‌దిలింది.

Also Read : AP CID Chief : నారా లోకేష్ అరెస్ట్ త‌ప్ప‌దు

Leave A Reply

Your Email Id will not be published!